Home తెలంగాణ కల్లూరు మండల గ్రీవెన్స్ డే కార్యక్రమంలో పాల్గున్న సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్

కల్లూరు మండల గ్రీవెన్స్ డే కార్యక్రమంలో పాల్గున్న సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్

by VRM Media
0 comments

ది 14-05-2025 ( సోమవారం )

200 యూనిట్లు ఉచిత విద్యుత్ పై గృహజ్యోతి పథకంలో మాపి రానివారి కి సెక్రటేరియట్ నుండి గాని కలెక్టర్ ఆఫీస్ నుండి గాని ఆ ఆప్షన్ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు,

ప్రైవేట్ విద్యాసంస్థలపై అధిక ఫీజులు నియంత్రించాలి meoపై ఎమ్మెల్యే అసంతృప్తి

ఆఫీస్ కీ వొచ్చిన రైతులకీ , ప్రజలని కుర్చీ వేసి కూర్చోబెట్టి గౌరవించి వారి పని చేసి పెట్టాలి లేకపోతే ఎంత పెద్ద ఉద్యోగి అయినా సరే ఎట్టి పరిస్థితిలో సహించను అని హెచ్చరించిన ఎమ్మెల్యే

నేరుగా ఎమ్మెల్యేనే వొచ్చి అర్జీలు తీసుకొని సమస్య పరిష్కారం చేయటం పట్ల అనందం వ్యక్తి చేస్తున్న మండల ప్రజలు

ఆర్డబ్ల్యూఎస్ పని విధానంపై గరం గరంగా మాట్లాడిన ఎమ్మెల్యే

విద్యుత్ శాఖ నాణ్యత లేని విద్యుత్ పోల్ పై నాణ్యత పరిమాణాలు పాటించండి,
రేషన్ కార్డులో అవ్వక తవ్వకాలు జరిగితే సహించేది లేదు, వెంటనే ఆర్డిఓ కి సంప్రదించగలరు,తెలంగాణ ప్రభుత్వం ప్రజల వద్దకే పాలన అనే కార్యక్రమం లో భాగంగా ప్రతి సోమవారం రెవిన్యూ ఆఫీస్ లో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.

కావున ఈ రోజు ఈ కార్యక్రమం లో అధికారులుతో కలిసి ఎమ్మెల్యే పాల్గొని ప్రజల సమస్యలు స్వికరించి పరిష్కరించటం జరిగింది.

ఈ కార్యక్రమం లో కల్లూరు మండల అన్ని శాఖల అధికారులు రెవిన్యూ, పంచాయతీ రాజ్ , అగ్రికల్చర్, ఇరిగేషన్,RWS, విద్యుత్, ఉపాధి హామీ, R&B, మండల డెవలప్మెంట్, హోసింగ్, విద్య,వైద్యం శాఖలపై సమీక్షా చేసి ప్రస్తుత వివరాలు సేకరించి, చేయవలిసిన పనులుఫై అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఎమ్మెల్యే,

ప్రజల నుంచి వొచ్చిన ప్రతి సమస్యని విని సంబంధిత శాఖ వారికీ ఎండర్జ్ చేసి మళ్ళీ గ్రీవెన్స్ డే కళ్ల సమస్య పరిష్కారం చెయాలి అని ఆదేశాలు జారీ చేసినారు

విద్య వైద్యం వ్యవసాయం మీద జాగ్రత్తగా పని చెయాలి అని ప్రతి ఒక్కరికి ఇవి చాలా అవసరం అని ఎమ్మెల్యే అధికారులకీ చెప్పటం జరిగింది.

రోడ్స్,డ్రైన్స్ ఎస్టిమేషన్ తీసుకొని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ కీ ఇవ్వాలి అని వాటిని మినిస్టర్స్ దెగ్గరికి తీసుకొని పోయి సాంక్షన్ చేస్తాను అని చెప్పటం జరిగింది.

ప్రతి ఒక్కరికి సంక్షేమ పధకాలు అందాలి అని దానికి అందరు అధికారులు బాధ్యత తీసుకోవాలి అని చెప్పటం జరిగింది.

ఐకెపి లో మహిళలకు ఎటువంటి అన్యాయం జరిగినా సహించేది లేదు, వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం ఎమ్మెల్యే ఈ కార్యక్రమం లో AMC చైర్మన్ భాగం నీరజ గారు, RDO , MRO , ఎంపీడీఓ, మున్సిపాలిటీ కమిషనర్ గారు, EO గారు, అన్నీ శాఖల AE DE లు మరియు మండల నాయకులు, ప్రజలు పాలుగోన్నారు.

2,831 Views

You may also like

Leave a Comment