



.ప్రభుత్వ ఆసుపత్రిలో ఆసుపత్రి కార్మికులు సోమవారం నుంచి వేతనాలు కొరకు సమ్మె సైరన్ మోగించారు. కల్లూరు లోని హెల్త్ కమ్యూనిటీ ఆసుపత్రిలో గత మూడు నెలల నుంచి వేతనాలు రాకపోవటంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు దీంతో నాలుగవ నెల గడుస్తున్న వేతనాలు కార్మికులకు అందకపోవటంతో కార్మికుల అవస్థలు పడుతున్నట్లు, దీనివల్ల సోమవారం నుంచి వేతనాలు పడే వరకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రోజువారి నిరసన కార్యక్రమాలు ఆందోళన కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. చాలీచాలని వేతనాలతో రేక్కాడితే డొక్కాడని కుటుంబాల వారు జీవనం సాగక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. వారికి వెంటనే వేతనాలు మంజూరు చేసి ఆ కుటుంబాలను ఆదుకోవాలని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు వేము రాంబాబు ప్రభుత్వ ఆసుపత్రి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ మధు కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల నాయకులు దయాకర్ రావు, లతోపాటు కార్మికులు పేషంట్ కేర్ ,స్వీపర్లు, సెక్యూరిటీ గార్డులు, వంశి నాగమణి ,కోటేశ్వరి, రంజాన్ బి, లక్ష్మీ ప్రసన్న, మేరీ ,తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.