Home ఆంధ్రప్రదేశ్ రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి చెందడం బాధాకరం,,

రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి చెందడం బాధాకరం,,

by VRM Media
0 comments

మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది,,
రాజంపేట పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు

VRM న్యూస్ అన్నమయ్య జిల్లా ఇంచార్జ్ రవిబాబు జూలై 15

రాజంపేట; పుల్లంపేట మండల పరిధిలోని రెడ్డిపల్లి చెరువు కట్ట వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది కూలీలు చనిపోవడం చాలా బాధాకరమని, పొట్టకూటి కోసం కూలికి వెళ్లి ప్రమాద బారిన పడి చనిపోవడం మనసును కలచివేచిందని, రాజంపేట టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు తెలియజేశారు. సోమవారం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాలను పరిశీలించి, అలాగే గాయపడిన వారిని పరామర్శించారు. అనంతరం వైద్యులను అడిగి గాయపడిన వారి వైద్య వివరాలను అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

2,811 Views

You may also like

Leave a Comment