

పాడేరు (అల్లూరి జిల్లా) న్యూస్ :-VRM Media
అల్లూరి జిల్లా పాడేరు ప్రధాన కేంద్రం స్థానిక కోర్టు ప్రాంగణంలో స్టేట్ లీగల్ సర్వీస్ అధారిటీ హైకోర్టు మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి. రాజు వారి ఆదేశాల మేరకు పాడేరు ప్రథమ శ్రేణి జ్యుడీసీయల్ మెజిస్ట్రేట్ & మండల లీగల్ అథారిటీ చైర్మన్ అయినటువంటి ఏ. రాము ఆధ్వర్యంలో నేడు కేసులు పరిష్కారం నిమిత్తం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కోర్టులో ఉన్న కేసులకు సంబంధించి రాజీ పడేందుకు అవకాశం ఉన్న వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకునేందుకు కక్షిదారులు ముందుకు రావాలని పిలుపునిస్తూ, కోర్టులో గల క్రిమినల్ కేసులకు సంబంధించి తక్కువ సమయంలో ఎలా పరిష్కారం చేసుకోవాలి వంటి వాటిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం నిమిత్తం సంబంధిత కక్షిదారులకు కరపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాడేరు ప్రథమ శ్రేణి జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ & మండల లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ ఏ రాము తో పాటు కోర్టు సిబ్బంది, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.