


సిద్దవటం:VRM న్యూస్ ప్రతినిధి లక్ష్మీనారాయణ జూలై 15:
సిద్ధవటం మండలం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, యువ నేత నారా లోకేష్ నాయకత్వంలో, ఇంచార్జి మంత్రివర్యులు సబితమ్మ చొరవతో రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు జగన్ మోహన్ రాజు సూచనలతో, టక్కోలు గ్రామం బీసీ కాలనీ లో “సూపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమాన్ని పార్లమెంట్ కార్యదర్శి నాగముని రెడ్డి గారు ఘనంగా మూడవ రోజు కొనసాగించారు.
ఈ సందర్భంగా నాగముని రెడ్డి మాట్లాడుతూ,
“ప్రతి కుటుంబానికి మేలు జరిగేలా కూటమి ప్రభుత్వం పని చేస్తోంది. మహిళల కోసం ఉచిత బస్సులు, పింఛన్ల పెంపు, వంటి అనేక పథకాలు అమలవుతున్నాయి,” అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో భాగంగా, కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలంలో అమలైన అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ పథకాల వివరాలను టీడీపీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించగా స్మశానం కు దారి , పెన్నా నీళ్లు, మెయిన్ రోడ్ నుండి కాలనీ లోకి సీసీ రోడ్ కావాలి అని ప్రజలు ప్రధానం గా అడుగుతున్నారు. ఈ విషయాలు చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ గారి, జగన్మోహన్ దృష్టికి తీసుకుపోయి పరిష్కారం అయ్యేలా చూస్తాము అని చెప్పడం జరిగినది .
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సర్పంచ్ లక్ష్మి దేవి శంకర, చిన్నయ్య, పెంచలయ్య, గంగాదేవి, స్కూల్ చైర్మన్ నాగలక్ష్మి మరియు అనేకమంది టీడీపీ కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.