
Vrm media

ఇటీవల కాలంలో వర్షాలు పడక నీళ్లు లేక రైతులు వేసినటువంటి పంట పొలాలు ఎండిపోతుంటే రైతులందరూ కలిసి ఖమ్మం జిల్లా రైతు సమన్వయ సమితి మాజీ కమిటీ సభ్యులు “పసుమర్తి చందర్రావు” గారి అధ్యక్షతన రైతు పక్షం నాయకులు పత్రికా సమావేశం నిర్వహించి రైతులు తమ పంట పొలాలు నీళ్లు లేక ఎండిపోతున్నాయని స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీమతి డాక్టర్ “మట్టా రాగమయి దయానంద్” గారికి ఖమ్మం జిల్లా ముగ్గురు మంత్రివర్యులకు పత్రిక సమావేశం ద్వారా విన్నవించుకోవడం జరిగింది
ఈ సందర్భంలో రైతుల బాధలు తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే గారు మరియు ఖమ్మం జిల్లా మంత్రివర్యులు తక్షణమే సీతారామ ప్రాజెక్ట్ నుంచి నాగార్జునసాగర్ ఆయకట్టుకు నీళ్లు వదిలించడం జరిగింది. మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు మీద ప్రేమను చూపిస్తూ నీళ్లు వదిలి ఎండిపోతున్న పంటలను కాపాడినందుకుగాను రైతుల తరఫున రైతు పక్షం నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు… తెలియజేయడం జరిగింది…. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి షేక్ యాకూబ్ అలీ, మాజీ ఎంపీటీసీలు దామల రాజు, దాసరి వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచ్ బంకా బాబు, సత్తుపల్లి నియోజకవర్గం సేవాదళ్ అధ్యక్షులు పాప బత్తిని నాగేష్, కళ్యాణపు వెంకటేశ్వరరావు, యాసా శ్రీకాంత్, షేక్ ఈసూబ్, గుమ్మడిదల ప్రవీణ్ రైతులు పిచ్చిరెడ్డి, కుసునూరు బాల నాగేశ్వరరావు, పోట్రు రామారావు, గుండ్ల రవీంద్ర, కుంచాల గురవయ్య, ఉబ్బన దేవదాసు, దొంగల కృష్ణ,తదితరులు పాల్గొన్నారు.