

జిల్లా బదిలీల్లో భాగంగా పెనుబల్లి తహసిల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న భూభారతి ఆపరేటర్ రాజేష్ వేంసూరు మండలంకు,సిసిఎల్ ఆపరేటర్ మారయ్య కల్లూరుకు ఆర్డీవో కార్యాలయమునకు బదిలీ కావడం జరిగింది. ఈ ఇరువురి స్థానంలో కల్లూరు తహసిల్దార్ కార్యాలయం నుండి రమేష్, వేంసూర్ తహసిల్దార్ కార్యాలయం నుండి లక్ష్మారెడ్డి ఇక్కడకు రావడం జరిగింది.తహసిల్దార్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న కళ్యాణ లక్ష్మి,రేషన్ కార్డు పనులతో పాటు మిగిలి ఉన్న పనులను శని, ఆదివారంలు సెలవు దినాలు అయినా కూడా కింది స్థాయి సిబ్బందితో కలిసి పని చేస్తు పనులు పూర్తి చేయడం జరుగుతుందని తహసిల్దార్ నారాయణమూర్తి అన్నారు. ప్రజలకు రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నిరంతరం వారి సమస్యలపై పని చేస్తూనే ఉంటామని ఈ సందర్భంగా తహసిల్దార్ అన్నారు. కొత్తగా చేరిన సిబ్బందితో ఆఫీసులో పనులు వేగం పుంజుకున్నాయని అన్నారు.రైతులు, ప్రజలు తమ సమస్యల పట్ల ఎప్పుడైనా కార్యాలయం ఆఫీస్ సమయాల్లో తనని కలవవచ్చు అని తహసిల్దార్ నారాయణమూర్తి అన్నారు. పెనుబల్లి తాసిల్దార్ కార్యాలయంనకు వచ్చి నెల అయినా కూడా కార్యాలయ పరిసరాలను శుభ్రంగా ఉచ్చటమే కాకుండా నిత్యం ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాటికి పరిష్కారం దిశగా పనిచేస్తున్నారు.ప్రజలకు రైతులకు సంబంధించిన ఎటువంటి ఫైళ్లను తమ వద్ద పెండింగ్ ఉంచుకోవద్దు అని కింది స్థాయి సిబ్బందికి తెలియజేశారు.