

కడప,VRM న్యూస్ స్టాప్ రిపోర్టర్ పి ఈశ్వర్ జూలై 16
ప్రకృతి వ్యవసాయం రైతులకు ఓ అద్భుత అవకాశం అని, కొత్తగా ప్రకృతి వ్యవసాయం ప్రారంభించాలనుకునే రైతుల కోసం నమోదు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ ప్రజా భాగ్యస్వామ్య ప్రకృతి వ్యవసాయం – రైతు సాధికార సంస్థ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ఎస్వీ ప్రవీణ్ కుమార్ తెలిపారు.మంగళవారం ఆయన వారి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.కాలానుగుణంగా నీటి లభ్యత తగ్గిపోతుండటం, వాతావరణ మార్పులు, నేల క్షీణత, అధిక సాగు ఖర్చులు వంటి సమస్యలతో వ్యవసాయ భద్రత ప్రమాదంలో పడుతుందని చెప్పారు.ఈ నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయం ఒక సమగ్ర, స్థిరమైన పరిష్కారంగా ఎదుగుతోందని చెప్పారు. రసాయనాలను విడనాడి, పర్యావరణానికి అనుకూలంగా సాగు చేసే ప్రకృతి వ్యవసాయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రజా రైతు సాధికార సంస్థ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రోత్సహిస్తోందని వివరించారు. ఈ పద్ధతిలో జీవామృతం, బీజామృతం, మల్చింగ్, అంతర పంటలు, 365 రోజుల నేల కప్పివుంచడం వంటి ప్రక్రియలు ప్రధానంగా ఉంటాయన్నారు.ఇవి నేల ఆరోగ్యం మెరుగుపరచడంతో పాటు, వ్యవసాయ వ్యయాలను తగ్గించి దిగుబడులను పెంచుతాయన్నారు “ఈ ప్రకృతి వ్యవసాయ ఉద్యమంలో భాగస్వాములవ్వాలనుకునే రైతులు, యువ రైతులు , ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరిని తాము హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నామని తెలిపారు.శిక్షణా అవకాశాలు, సాంకేతిక సహాయం, మార్కెట్ కు అనుకూలమైన సాగు పద్ధతుల కోసం వెంటనే పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. మన భూమి, మన కుటుంబం, మన భవిష్యత్తు కోసం ప్రకృతి మార్గంలో అడుగులు వేయాలని వారు పిలుపునిచ్చారు. ఇది పూర్తిగా ఉచిత సేవ అని ఎలాంటి ఫీజులు ఉండవన్నారు .నమోదు చేసిన రైతులకు శిక్షణ కార్యక్రమాలు, మార్గదర్శక పుస్తకాలు, సాంకేతిక సహాయం లభిస్తుందన్నారు.ఈ నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయం చేయాలనుకునే ఆసక్తి ఉన్న రైతులు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని తమ కార్యాలయంలో సంప్రదించాలని ,