

కడప ఎడ్యుకేషన్ ( VRM న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ పి ఈశ్వర్) జులై 16:
వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు మండలం గండికో ట లో 14వ తేదీ జరిగిన బాలిక హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మనోహర్, శ్రీనివాసులురెడ్డి, కోశాధికారి లక్ష్మీదేవి, ఐద్వా జిల్లా అధ్యక్షులు ఐఎన్ సుబ్బమ్మలు ఒక సంయుక్త ప్రకటనలో డిమాండ్ చేశారు.ముఖ్యంగా అమ్మాయిలను చంపడం, హత్యాచారాలు చేయడం దారుణానికి పాల్పడడం పరిపాటిగా మారుతోందన్నారు. ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరమని తెలిపారు. ప్రొద్దుటూ రులో చదువుతున్న అమ్మాయి గండికోటలో శవమై కనిపించడం బాధాకరమని తెలిపారు. ప్రేమ పేరుతో, పరువు పేరుతో విద్యార్థి నిలను చంపడం ఘోరమని తెలిపారు. ముఖ్యంగా రాష్ట్రములో హోం మినిస్టర్ గా ఒక మహిళ ఉందని గుర్తు చేశారు. ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్ట కరమన్నారు. రాష్ట్ర హోమ్ మినిస్టర్ ,చంపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఏదేమైనా విద్యార్థిని హత్యకు కారకులైన, ఎంతటి వారినైనా విచారించి బాధ్యులపై కఠినంగా శిక్షించాలని కోరారు.