


కడప జిల్లా VRM న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ పి ఈశ్వర్ జూలై 16
అసోసియే షన్ ఆధ్వ ర్యంలో సీనియర్ మెన్ జిల్లా సెలెక్షన్స్ బుధవారం కడప ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో వైయస్సార్ కడప జిల్లా ఫుట్బాల్ అసోసి యేషన్ అధ్యక్షు డు,ఆంధ్రప్ర దేశ్ ఫుట్బాల్ అసోసి యేషన్ రాష్ట్ర కార్యదర్శి డేనియల్ ప్రదీప్ ఆద్వర్యంలో జరిగాయి.ఈ సందర్భంగా డేనియల్ ప్రదీప్ మాట్లాడుతూ ఇందులో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఆసక్తి గల క్రీడాకారులు పాల్గొన్నా రని అన్నారు. ఇందులో భాగంగా ప్రతిభ కనబరిచిన ఫుట్బాల్ సీనియర్ మెన్ క్రీడా కారుల ఎంపిక చేశామ న్నారు. క్రీడలు శారీర క, మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయని చెప్పారు.క్రీడల్లో రాణిం చిన వారు రాష్ట్ర, జాతీయ స్థాయి ల్లో జరిగే పోటీల్లో పాల్గొనేం దుకు అవకాశం ఉందని చెప్పారు.ఇందులో రాణించిన వారికి సంతోష్ ట్రోఫీ లో పాల్గొనే అవకాశం ఉందని చెప్పారు అంతే కాకుండా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయని అన్నారు.ఈ సెలెక్షన్స్ కు అనుమతి ఇచ్చిన ఆర్ట్స్ కాలేజీ యాజమా న్యానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సెలెక్షన్స్ లో వైఎస్సార్ కడప జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి ఎం సుధీ ర్ కుమార్.ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్ అనిల్ కుమార్, వైఎస్సార్ స్పోర్ట్స్ స్కూల్ కోచ్ హరి, సీనియర్ ప్లేయర్ ఎం గంగయ్య తదితరులు పాల్గొన్నారు