దేవీపట్నం, జూలై 16 VRM Media దుర్గా ప్రసాద్:



అల్లూరి సీతారామరాజు జిల్లా,రంపచోడవరం నియోజకవర్గం,రంపచోడవరం ఐటిడిఏ నందు జీవో ఎంఎస్ నెంబర్ 3 మరియు ఏజెన్సీ చట్టాలు ఫై వర్క్ షాప్ జరిగింది. మరియు ఆదివాసీ సంఘాల నాయకులు నుండి అభిప్రాయాలు కూడా సేకరించడం జరిగిందన్నారు.అనంతరం ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర కమిటీ నాయకులు ఆధ్వర్యంలో గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు ఎస్.భార్గవి ఐఏఎస్ కి ఆశ్రమ పాఠశాలలో తక్షణమే ఏ.ఎన్.ఏం పోస్టులు భర్తీ చేయాలని వినతి పత్రం ఇచ్చామని తెల్లం శేఖర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ మొడియం శ్రీనివాసు రావు,కొవ్వాసు శ్రీనివాసరావు,కంగల శ్రీనివాస్,మడివి నెహ్రూ,కారం రామన్న దొర,మడకం వరప్రసాద్ దొర,చవలం శుభ కృష్ణ దొర,యాలగాడ నాగేశ్వరరావు,అడ్వకేట్స్ ఆత్రం నవీన్ కుమార్,మడివి రవితేజ మొదలైన వారు పాల్గొన్నారు.