

అన్నమయ్య జిల్లా రాజంపేట
తేదీ,17.07.2025
అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ.వి.విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు, అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా పోలీసుల ఆరోగ్య పరిరక్షణకు చేపట్టిన హెల్త్ చెకప్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా, రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పోలీసులకు సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే ఐపీఎస్ స్వయంగా పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ, ప్రజలకు నిరంతరం సేవలు అందించే పోలీసుల ఆరోగ్యం అత్యంత కీలకమని ఉద్ఘాటించారు. విధి నిర్వహణలో ఒత్తిడి, సమయపాలన లేకపోవడం వంటి కారణాల వల్ల పోలీసులు తమ ఆరోగ్యంపై తగిన శ్రద్ధ పెట్టలేకపోతున్నారని ఆయన అన్నారు. ఈ హెల్త్ చెకప్ కార్యక్రమం ద్వారా పోలీసులు తమ ఆరోగ్య స్థితిని తెలుసుకుని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడానికి వీలవుతుందని తెలిపారు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, పౌష్టికాహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండాలని పోలీసులకు సూచించారు.
పోలీసుల శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటేనే, వారు ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలు అందించగలరని ఏఎస్పీ గారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.