


*-శ్రీనివాసరెడ్డికి ఘన స్వాగతం పలికిన చేనేత కార్మికులు
సిద్దవటం VRM న్యూస్ లక్ష్మీనారాయణ జూలై 17
సిద్దవటం మండలం మాధవరం -1పంచాయతీ పార్వతీపురం గ్రామంలో వెలసిన శ్రీ శీతల గంగమ్మ అమ్మవారి 22వ జాతర మహోత్సవం సందర్భంగా శ్రీ భద్రావతి భావనారాయణ చేనేత సొసైటీ సంఘం చైర్మన్ జింకా శ్రీనివాసులు ఆహ్వానం మేరకు గురువారం కడప టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్ప శ్రీనివాసరెడ్డి హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ ప్రతినిధులు ఆలయ మర్యాదలతో ఆయనకు శాలువా కప్పి సన్మానించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.ముందుగా చేనేత కార్మికులు ఆయనకు ఘన స్వాగతం పలికి సన్మానించారు. ప్రజలందరికీ శీతల గంగమ్మ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు.అనంతరం ఎస్.కే. ఆర్ నగర్ లోని బోడా లోకేష్ స్వగృహంలో విందు కార్యక్రమంలో పాల్గొన్నారు.