


,
సిద్ధవటంVRM న్యూస్ లక్ష్మీనారాయణ జూలై 17
రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం మాధవరం 1 గ్రామస్తుల ఆహ్వానం మేరకు నేడు గురువారం హాజరై పార్వతీపురం గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ శీతల గంగమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించిన రాజంపేట పార్లమెంట్ ఇంచార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజుగారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు తీర్థ ప్రసాదాలు అంద జేసి చమర్తిని ఘనంగా సన్మానించడం జరిగినది. చమర్తి మాట్లాడుతూ పార్వతీపురం గ్రామస్థులకు ప్రజలకు ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో సిద్ధవటం మండల టిడిపి అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు ఆలయ కమిటీ సిబ్బంది పాల్గొనడం జరిగినది.