
హుకుంపేట (అల్లూరి జిల్లా) న్యూస్: VRM Midea దుర్గాప్రసాద్


అల్లూరి జిల్లా హుకుంపేట మండలం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హుకుంపేట పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రగ్స్ నియంత్రణ అవగాహన సదస్సుకు జిల్లా డిఎస్పీ. అహ్మద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి వాల్ పోస్టర్ ను ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ఏజెన్సీ ప్రాంతంలో పట్టిపీడిస్తున్న ముఖ్య సమస్య గంజాయి, దానిని పూర్తిస్థాయిలో నిర్మూలన చేయాలని మన విద్యాశాఖ మంత్రి లోకేష్ పిలుపుమేరకు మన జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ఆదేశాల మేరకు జిల్లా మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా అహర్నిశలు శ్రమించి పనిచేస్తున్నారు. ఈ తరుణంలో బాధాకరమైన విషయం ఏమిటంటే విద్యార్థులు కూడా కొంతమంది ఈ గంజాయి బారిన పడి తమ జీవితాలు నాశనం చేసుకోవడం చాలా దురదృష్టకరమని తెలిపారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే విద్యార్థుల్లో ఎవరైనా వీటి బారిన పడి బానిసత్వం అయినవారు ఉంటే నేరుగా తెలియజేస్తే డిపార్ట్మెంట్ వారికి డి ఎడిక్షన్ సెంటర్ ద్వారా ప్రత్యేక వైద్యం అందించి దీని నుండి విముక్తి కలిగేలా చేస్తామన్నారు.విద్యార్థులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మేము ఎవరికీ తెలియకుండా అసాంఘిక కార్యక్రమలు చేస్తున్నాము మమ్మల్ని ఎవరు ఏమి చేస్తారులే అనే ధీమాతో వుండే వారికి అడ్డుకట్ట వేసి వారిని గుర్తించి వారిపై కఠినమైన చర్యలు తీసుకునేందుకు పోలీస్ డిపార్ట్మెంట్, ఈగల్ టీమ్ లు మరియు డ్రోన్ల ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని మీరు ఎక్కడ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన గుర్తించి అదుపులోకి తీసుకొని శిక్ష పడేలా చేయడం ఖాయమని హెచ్చరికలు జారీ చేస్తూ, మీ జీవితాలు నాశనం కాకుండా ఉండాలంటే గంజాయి మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా శ్రద్ధగా చదువుకోవాలన్నారు. ఈ డ్రగ్స్ నియంత్రణ అవగాహన సదస్సు కార్యక్రమంలో అల్లూరి జిల్లా డిఎస్పి అహ్మద్ తో పాటు హుకుంపేట సీఐ సన్యాసిరాయుడు, ఎస్సై సూర్యనారాయణ పోలీస్ సిబ్బంది మరియు కాలేజీ అధికారులు మరియు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు హెచ్చరించారు. చెప్పేందుకు నువ్వు దేవుడు మీరు ముందుకు రాకపోయినా యేడల మా టీవీ ద్వారా అలాగే డ్రోన్లు