సిద్దవటం మండలం మాధవరం -1పంచాయతీ పార్వతీపురం గ్రామంలో వెలసిన శ్రీ శీతల గంగమ్మ అమ్మవారి 22వ జాతర మహోత్సవం సందర్భంగా గురువారం జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రతినిధులు ఆలయ మర్యాదలతో ఆయనకు శాలువా కప్పి సన్మానించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.