కల్లూరు జులై17(VRM న్యూస్): ప్రతినిధి శ్రీనివాస్ రాథోడ్
కల్లూరు మున్సిపాలిటీ పరిధి కప్పల బంధం గ్రామానికి చెందిన రేషన్ డీలర్ జిల్లెల్ల భాస్కర్ రెడ్డి గ్రామంలో ప్రధాన రహదారి లో గుంతలు ఏర్పడి, వర్షం వల్ల నీళ్ళు నిల్వ ఉండి రవాణాకు,వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా ఉండటం గమనించి తనవంతుగా సుమారు 5వేలా రూపాయలతో 10 ట్రిప్పుల మొరంను తోలించి గుంతలు పూడ్చి గ్రామస్తులు చేత శభాష్ అనిపించుకున్నారు. నా ఇల్లు నా కుటుంబం అనుకునే ఈ రోజుల్లో కూడా తనకున్న దాంట్లో ఊరు కోసం ఖర్చు చేయడం అతని ఔదార్యానికి నిదర్శనం.గ్రామంలో ఉన్న గుంతలు సొంత డబ్బులతో గుంతలు పూడ్చిన భాస్కర్ రెడ్డిని గ్రామస్తులు అభినందించారు.