


కల్లూరు జూలై 17 (VRM న్యూస్ శ్రీనివాస్ రాథోడ్ )
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ మట్ట దయానంద్ ఆదేశాల మేరకు కల్లూరు మండలం లింగాల గ్రామంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీని ఎన్నుకోవడం జరిగింది . సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఏనుగు సత్యం బాబు, తక్కెళ్ళ పార్టీ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ శాఖ అధ్యక్షులుగా దేవరపల్లి వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా ఎం సురేష్ ,కార్యదర్శిగా డి. భాస్కరరావు, సహాయ కార్యదర్శిగా ఎం. కరుణాకర్ రావు, 15 మంది కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ అవకాశం కల్పించినటువంటి ఎమ్మెల్యే రాగమయి, రాష్ట్ర నాయకులు దయానంద్, మండల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. లింగాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం శక్తివంశం లేకుండా కృషి చేస్తామని, కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యంలో ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలోనాయకులు దేవరపల్లి మంగపతి, మద్దినేని లోకేష్, మట్టూరి రామారావు, మోహన్ రావు, దేవరపల్లి శ్రీను, మద్దినేని గోపాలరావు, మట్టూరి వెంకట్రావు, మునిగంటి బాబు, తాళ్ల వెంకటేశ్వరరావు, బిరవల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.