కడప ఏడురోడ్లు ( VRM న్యూస్ స్టాప్ రిపోర్టర్ పి ఈశ్వర్ ) జులై 18: రైతుల వ్యవసాయానికి సంబంధించి స్మార్ట్ మీటర్ల బిగింపును తక్షణమే ఆపాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కదిరి ప్రసాద్ గౌడ్ గురువారం ఒక ప్రకటనలో డిమాం డ్ చేశారు.గత వైసిపి ప్రభుత్వం లో స్మార్ట్ మీటర్లు బిగుస్తుంటే అప్పుడు ప్రతి పక్షంలో ఉన్న టిడిపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి, నేటి మంత్రి లోకేష్ మీటర్లను పగులగొట్టాలని చెప్పారని అయితే నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దానిని తుంగలో తొక్కి స్మార్ట్ మీటర్ల బిగింపునకు పాల్పడు తున్నారని మండిపడ్డారు.ప్రతి పక్షంలో ఉన్నప్పుడు ఒక విధంగా, అధికారంలోకి వచ్చాక మరో రకంగా మాట్లాడడం శోచనీయ మన్నారు.చెప్పిన హామీలు అమలు చేయక పోతే రాజకీయ పతనం తప్పదన్నారు.సూపర్ సిక్స్ లో కేవలం ఒక వృద్ధాప్య పింఛన్లు తప్ప ఏదీ కూడా పూర్తిగా అమలు చేయలేదని చెప్పారు.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పై క్లారిటీ ఇవ్వలేదని అన్నారు.ఇచ్చిన హామీలు అమలు చేయలేక పోతే ప్రజల్లో విశ్వాసం కోల్పోతారని హితవు పలికారు.కేంద్రంలో రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే అభి వృద్ధి సాధ్యమని చెప్పారు. యువ నేత,తమ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే దేశం ప్రగతి పథంలో పురోగాభివృద్ది చెందుతుందని అన్నారు
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird