

వి ఆర్ ఎం బాల మౌలాలి ఒంటిమిట్ట ప్రతినిధి: వైయస్సార్ కడప జిల్లా మండల కేంద్రమైన ఒంటిమిట్ట బదిలీ అయిన సచివాలయ సిబ్బందికి ఒంటిమిట్ట పంచాయతీ సెక్రెటరీ సుధాకర్ పేరుపేరునా వారి సేవలను కొనియాడుతూ మీరు బదిలీ అయిన చోట కూడా ఇలాగే మంచి పేరు తెచ్చుకోవాలని ఎక్కడికి పోయినను ఒడిదోడుకులను అధిగమించి మీ పనిని అందరూ మెచ్చుకునేలా చేసుకుంటూ వెళ్లాలని ప్రతి ఒక్కరికి తెలియజేశారు. అదేవిధంగా ప్రతి ఒక్క సిబ్బందికి పట్టు శాలవతో పూలమాలతో సత్కరించినారు, ఇక్కడ పనిచేసే వెళ్లేవారు మీ యొక్క సేవలను వచ్చిన కొత్త సిబ్బందికి కొద్ది రోజులైనను ఫోన్లో అందుబాటులో ఉండాలని తెలియజేశారు. 100% పనులను ఎవరైతే సంపూర్ణంగా చేయగలరు అటువంటి ఉద్యోగులకి ఎక్కడైనను ఎప్పుడైనాను గౌరవం తో పాటు ప్రాముఖ్యత కూడా లభిస్తుందని తెలియజేశారు. మీ యొక్క పనులను మీరు సులభతరం చేసుకొనుటకు ఎంక్వైరీలకు క్యాంపులు వేయబడినప్పుడు అనుసంధానంగా ఉన్న వివరణ కూడా కలగలుపు కొని తెచ్చుకున్నట్లయితే పని సులభతరం అవుతుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డిఎల్డిఓ మైథిలి ఎంపీడీవో సుజాత రెవెన్యూ సెక్రటరీ అంజన్న సచివాలయ సిబ్బంది కొత్తగా ఏర్పాటు అయిన సిబ్బంది పాల్గొన్నారు