


కడప జిల్లాVRM న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ పి ఈశ్వర్ జూలై 18
కడప నగరంలోనే 2 వార్డు డివిజనల్ మరియు టీడీపీ రాష్ట్ర సభ్యులు, కడప జిల్లా అధ్యక్షులు రెడ్డెప్ప శ్రీనివాసరెడ్డి టీడీపీ పార్టీ కండువా కప్పి నాయకులను, కార్యకర్తలను ఆహ్వానించారు.
రెండో డివిజన్ కార్పొరేటర్ సుబ్బారెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో దేవుని కడప ఆడవాల మునిస్వామి వారి అనుచరులు, రామకృష్ణ, అలాగే వైయస్సార్ కాలనీకి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ అబ్దుల్ షుకూర్ అనుచరులు, వాసు సుబ్బరాయుడు, ఉక్కాయపల్లెకు చెందిన నాగరాజు వారి అనుచరులు, చలమారెడ్డిపల్లెకు చెందిన కృష్ణారెడ్డి – సుబ్బారెడ్డి మిత్రులు వందలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొని టీడీపీ పార్టీలోకి చేరారు.
ఈ సందర్భంగా పార్టీలో చేరిన నేతలకు స్వాగతం పలుకుతూ, టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఒక సంవత్సరం విజయవంతంగా పూర్తి చేసుకొని, ప్రతి వర్గానికీ మేలు చేసే సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, అభివృద్ధికి నడుస్తున్నదని వారు పేర్కొన్నారు. ప్రజల అభీష్టాలకు అనుగుణంగా పాలన సాగిస్తున్న టీడీపీ ప్రభుత్వం… యువతకు అవకాశాలు, మహిళలకు ఆత్మవిశ్వాసం, రైతులకు భరోసా, ఉద్యోగార్థులకు నూతన ఆశ కలిగించే మార్గంలో ముందుకు సాగుతోందన్నారు.