
దుర్గాప్రసాద్

హుకుంపేట (అల్లూరి జిల్లా) న్యూస్ : VRM Midea
అల్లూరి జిల్లా హుకుంపేట మండలం శోభకోట పంచాయితీ సర్పంచ్ పలాసి. శశి భూషణం నాయుడు ఆధ్వర్యంలో బదిలీపై వెళ్తున్న సచివాలయం సిబ్బందికి స్థానిక ప్రజలు, వివిధ శాఖల అధికారులు అందరూ మమేకమై సిబ్బందికి పూల మాలలు వేసి దుస్సాలువ కప్పి ఘనంగా సత్కరించి,వీడ్కోలు పలికారు. ఈ సందర్బంగా సర్పంచ్ పలాసి శశి భూషణం నాయుడు సచివాలయం సిబ్బందిన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఇక్కడ మాదిరి రాబోయే రోజుల్లో కూడా ప్రజలకు మరింత సేవలు అందించాలని, మనం చేస్తున్న వృత్తిని ఇష్టంగా చేస్తూ దృఢ సంకల్పంతో ప్రజలకు మమేకమై ప్రజలకు సేవ చేసి ఎక్కడ పని చేసిన మంచి పేరు తెచ్చుకుని ప్రజా శ్రేయస్సు కోసం పని చేయాలని శోభకోట సర్పంచ్ పలాసి.శశి భూషణం నాయుడు కోరారు .ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి సతీష్, వెలుగు సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, ఆశ వర్కర్స్, గ్రామ పెద్దలు ముఖ్యంగా స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.