జిల్లా సమగ్ర అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన ఆజెండాగా సిపిఐ మహాసభలు
VMR న్యూస్ అన్నమయ్య జిల్లా ఇంచార్జ్ రవిబాబు జులై 18
సారవంతమైన, సహజ సిద్ధ ప్రకృతి భూములను కార్పొరేట్లకు అప్పజెప్పడం తగదు
ప్రభుత్వ భూములను కార్పొరేట్లకు దోచిపెట్టడమే ప్రభుత్వ లక్ష్యమా
అన్నమయ్య జిల్లా సమగ్ర అభివృద్ధి కొరకు 10 వేల కోట్లు కేటాయించాలి
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య
అన్నమయ్య జిల్లా సమగ్ర అభివృద్ధి,ప్రజల సమస్యల పరిష్కారం కొరకు భవిష్యత్తు పోరాటాల నిర్వహించేందుకు ఆగస్టు 10 నుండి 12వ తేదీ వరకు మదనపల్లిలో జరగబోయే అన్నమయ్య జిల్లా మహాసభలు వేదిక కాబోతున్నాయని శుక్రవారం ఉదయం జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య అన్నారు.
ఈ సందర్భంగా గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ విభజిత అన్నమయ్య జిల్లాలో ఖనిజ నిక్షేపాలు సహజ సంపద హార్టికల్చర్ పంటలు పుష్కలంగా ఉన్నప్పటికీ అభివృద్ధి మాత్రం ఏమాత్రానికి ఈ జిల్లా నోచుకోలేదని ఈ జిల్లాలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మంగంపేట బైరటీస్ అప్పటి ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా బల్క్ టెండర్ల పేరుతో ఒకే వ్యక్తికి తక్కువ ధరతో దోచుకోవడానికి లైసెన్సులు ఇచ్చారని వాటిని అరికట్టడంలో ప్రభుత్వానికి ఆదాయం తీసుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, అలాగే ఈ జిల్లాలో ఎర్రచందనం దొంగల పాలు అవుతున్నది దాని రక్షించి ఈ జిల్లాలో ఎర్రచందనం ఆధారిత పరిశ్రమ ఏర్పాటు చేయాలని అలాగే అన్నమయ్య జిల్లాలో దొరికే ఖనిజ సంపద ద్వారా ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలని హార్టికల్చర్ పంటల ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసి ఈ జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని అలాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి త్రాగునీటి సాగునీటి ప్రాజెక్టుల సత్వరమే పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం ఏ మాత్రం చిత్తశుద్ధి చూపించడం లేదని ఎద్దేవా చేశారు. గాలేరు నగరి ప్రాజెక్టు హంద్రీనీవా ప్రాజెక్టు మొదలుపెట్టి మూడు దశాబ్దాలు దాటిపోయిన ఇంతవరకు అవి పూర్తి కాకపోవడం పూర్తయిన వెలిగల్లు జురికోన ప్రాజెక్టుల కుడి ఎడమ కాలువలు నిర్మాణం జరగక రైతులకు నీరు అందడం లేదని అన్నమయ్య ప్రాజెక్టు ఇసుకాసుర ధన దాహానికి వరద పాలైపోయి మూడు సంవత్సరాల అయిపోయినప్పటికీ కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారు తప్పితే దాని నిర్మాణం కొరకు చర్యలు లేవని గతంలో ఉన్న పరిశ్రమలు నందలూరు ఆల్విన్ పరిశ్రమ రైల్వే లోకో షెడ్ రైల్వే కోడూరు అప్సా జ్యూస్ ఫ్యాక్టరీ సిటిఎం స్పిన్నింగ్ మిల్ పీలేరు నూనె విత్తల కర్మాగారం, సహకార రంగాల లో ఉన్నటువంటి పాల కేంద్రాలు లాంటి పరిశ్రమలు జిల్లాలో మూతపడిన వాటి ప్రత్యామ్నాయ పరిశ్రమలు ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం లేదని. కడప బెంగళూరు రైల్వే లైను గత ప్రభుత్వాలు ఏర్పాటు దిశగా ప్రయత్నాలు జరిగితే దానిని వద్దని ముదిగుబ్బ మీదగా అలైన్మెంట్ మార్చడం చాలా దారుణమని ప్రస్తుత కూటమి ప్రభుత్వం కడప బెంగళూరు రైల్వే లైను పాత అలైన్మెంట్ లోనే ఏర్పాటు చేయాలని రాయచోటి పీలేరు మదనపల్లె ప్రాంతాలు మీదుగా రైళ్లు రాకపోకలు జరగడం వలన ఈ ప్రాంతాల రైతులు తమ పంటలను ఎగుమతి చేసుకోవడానికి సాఫ్ట్వేర్ రంగం ఉన్నటువంటి యువత బెంగళూరుకు సులభ ప్రయాణం చేయడానికి ఉపయోగపడుతుందని వారు గుర్తు చేశారు అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటినుండి ఇచ్చిన వాగ్దానాలను గాలికి వదిలేసి ప్రభుత్వ భూములను సహజ సిద్ధ ప్రకృతిని కార్పొరేట్ కంపెనీలకు దారా దత్తం చేస్తున్నారని అది అన్నమయ్య జిల్లా మదనపల్లె లో ఉన్నటువంటి హార్సీహిల్స్ సహజ ప్రకృతి అందాలను బాబా ముసుగులో ఉన్నటువంటి కార్పొరేట్ దిగ్గజం రాందేవ్ బాబాకు అప్పచెప్పాలని చూడడం, మరోపక్క సారవంతమైనటువంటి భూములు కరేడు ప్రాంత ంలోని 8400 ఎకరాల భూములను రియల్ ఎస్టేట్ దందా చేసుకోవడానికి ఇండో సాల్ కంపెనీకి అప్పజెప్పాలని గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రస్తుత కూటమి ప్రభుత్వం చూడడం చాలా దారుణమని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లోకేష్ చెప్పినా రెడ్ బుక్ ద్వారా అవినీతిని అరికడతామని చెప్పిన లోకేష్ నేడు ఆ రెడ్డి బుక్కు లోని అవినీతి వ్యక్తులు నేరు నిజాయితీ పరులు అయిపోతున్నారని అంటే అది రెడ్ బుక్కు కాదు కలెక్షన్ బుక్ అని ప్రజానీకానికి అర్థమవుతున్నదని వారన్నారు. రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచమని చెప్పినటువంటి నాయకులు సంవత్సర కాలంలో నాలుగు సార్లు విద్యుత్ చార్జీలు పెంచి ప్రజల పైన 15450 కోట్లు విద్యుత్ చార్జీల పేరుతో భారం వేశారని ఆయన అన్నారు. ఇవే కాకుండా రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని, పేదలకు పంచవలసిన భూములను ప్రభుత్వ పెద్దలు దోచుకుంటున్నారని ఇలాంటి అనేక సమస్యల పైన భవిష్యత్తు పోరాటాలకు సిద్ధం కావడానికి అన్నమయ్య జిల్లా మహాసభలు ఆగస్టు 10 నుండి 12 తేదీ వరకు మదనపల్లిలో జరగబోతున్నాయని అదేవిధంగా ఆగస్టు 20 తేది నుండి 25వ తేదీ వరకు రాష్ట్ర మహాసభలు ఒంగోలు జరుగుతున్నాయి అని ఈ మహాసభలలో ప్రజా సమస్యల పరిష్కారమే పోరాట దిశగా ప్రధాన అజెండాగా మహాసభలు జరగబోతున్నాయని ఈ మహాసభలకు కార్మిక కర్షక రైతు వ్యవసాయ కూలీ విద్యార్థి యువజన మహిళలు నిరుద్యోగులు వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. సమావేశంలో సిపిఐ అన్నమయ్య జిల్లా సహాయ కార్యదర్శి పి మహేష్ నియోజకవర్గ కార్యదర్శి ఎం శివరామకృష్ణదేవరా పాల్గొన్నారు
