

చోరికి యత్నించిన దొంగలు చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు
హుకుంపేట (అల్లూరి జిల్లా ) న్యూస్ : VRM Midea
అల్లూరి జిల్లా హుకుంపేట మండలం స్థానిక బొడ్డాపుట్టు పరిసర ప్రాంతంలో ద్విచక్ర వాహనం చోరీకి యత్నించిన దొంగలు,ఎంతో చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు. వివరాలు హుకుంపేట మండలం తాడిపుట్టు గ్రామానికి చెందిన సుబ్బారావు అనే వ్యక్తి తన యొక్క ద్విచక్ర వాహనం (స్కూటీని ) రోడ్డు పక్కన నిలిపివేసి కొంత దూరంలో ఉన్న తమ పొలంలో పనిచేస్తుండగా, 2 దుండగులు వాహనం ఎత్తుకెళ్తుండడంతో గమనించిన స్థానికులు ఎవరు మీరు అని కేకలు వేసి పట్టుకునేందుకు పరుగులు తీసి ప్రయత్నించిన పట్టుకోవడం విఫలం కావడంతో వెంటనే స్థానికులు హుకుంపేట పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న హుకుంపేట మండల పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ సూర్యనారాయణ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని చోరీ జరిగిన తీరు వివరాలు ఆధారాలు సేకరించి పరిసర ప్రాంతాల్లో తమ సిబ్బందిని టీములుగా ఏర్పాటు చేసి గంటల వ్యవధిలో ఎంతో చాకచక్యంగా దొంగలను పట్టుకున్నారు. ఈ చోరీ ఘటనపై ఎస్సై సూర్యనారాయణ మాట్లాడుతూ ఈ ఇద్దరు దొంగలు మైదాన ప్రాంతమైనటువంటి గాజువాక ప్రాంతానికి చెందిన వారని తెలిపారు. వీరు వద్ద నుండి ఒక ద్విచక్ర వాహనం కూడా స్వాధీనం చేసుకోవడం జరిగిందని. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ మధ్యకాలంలో అల్లూరి జిల్లా పరిసర ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు చోరీలకు వీళ్లకు సంబంధం ఉందా లేదా అనే కోణంలో క్రైమ్ డిపార్ట్మెంట్ వారు విచారణ కొనసాగిస్తున్నారని, ఇరువురి పై కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఏది ఏమైనాప్పటికీ గంటల వ్యవధిలో ఎంతో చాకచక్యంగా దొంగలను పట్టుకొని దొంగలకు చెక్ పెట్టిన ఎస్సై సూర్యనారాయణతో పాటు వారి పోలీస్ సిబ్బందికి ప్రజలు అభినందనలు తెలియజేస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు.