
Vrm media ప్రతినిధి భద్రం రాజానగరం :


సారాయి ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, ప్రజలను చైతన్య పరిచి ఆరోగ్యకరమైన రాజనగరంగా తీర్చిదిద్దాలి ఎమ్మెల్యే “బత్తుల”
ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ఎక్సైజ్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశం లో పాల్గొన్న రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ “బత్తుల బలరామకృష్ణ” గారు
👉ఈ సమీక్షా సమావేశం లో బెల్ట్ షాపులపై ఉక్కు పాదం మోపాలని రాజనగరం శాసనసభ్యులు శ్రీ “బత్తుల బలరామకృష్ణ” గారు అన్నారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో ఎక్సైజ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులతో ఆయన సమీక్షిస్తూ బెల్టు షాపులు, అక్రమసారా ,గంజాయి వంటి సంఘానికి చేటు కలిగించే మాదకద్రవ్యాలను తాను ఉపేక్షించనని వివరించారు. వీటిని ఎటువంటి పరిస్థితులను అరికట్టాల్సిందేనని ఆయన అన్నారు. సంఘ వ్యతిరేక కార్యక్రమాలు ఎవరైనా ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ప్రోత్సహిస్తున్న తాను తప్పనిసరిగా అడ్డుకుంటానని, ఈ విషయం అందరూ గమనించాలని ఆయన హెచ్చరించారు. ఇందుకు అధికారులు తనకు పూర్తిస్థాయిలో సహకరించాలని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం నాణ్యమైన లిక్కర్ అందిస్తోందని, ప్రజా ఆరోగ్యం దెబ్బతీసే ప్రయత్నం ఎవరూ చేసినా చూస్తూ ఊరుకోమని చెప్పారు.బెల్ట్ షాపులు, అక్రమ సారాయి ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, ప్రజలను చైతన్య పరచాలని ఈ ప్రజాచైతన్య కార్యక్రమంలో తాను పాల్గొంటానని తెలిపారు. మండలానికి ఒకటి చొప్పున మూడు మండలాల్లో మూడు గ్రామాల్లోముందుగా ఈ ఎవరెనెస్ క్యాంప్ నిర్వహించాలని ఆయన ఆదేశించారు. గ్రామాల్ల బెల్ట్ షాపులు , అక్రమసారా ప్రోత్సహించడం కొంతమంది తమకు ఆదాయ వనరుగా భావిస్తున్నారని అటువంటి చేష్టలను తాను అడ్డుకొని తీరతామని ఆయన తెలిపారు. సంఘ వ్యతిరేక శక్తులకు లొంగే రకాన్ని కాదని పలుమార్లు పలు వేదికల్లో తాను స్పష్టంగా చెబుతున్నా,మత్తు పదార్థాలకు అరికట్టాలని తాను శాసనసభ లో ప్రస్తావించడం జరిగిందని చెప్పారు. ఇక నుంచి తప్పుడు విధానాలు అనుసరించే వారు తమ నడత తప్పని సరిగా మార్చుకోవాలి.
👉ఈ సమీక్షా సమావేశం లో ఎక్సైజ్ సూపరిండెంట్ గారు, సి. ఐ. లు, శ్రీకృష్ణపట్నం గ్రామ సర్పంచ్ కిమిడి శ్రీరామ్ గారు, భూపాలపట్నం గ్రామ సర్పంచ్ గుల్లింకల లోవరాజు గారు, సీనియర్ నాయకులు అడపా శ్రీనివాస్ గారు తదితరులు పాల్గొన్నారు.