







VRM మీడియా న్యూస్ రిపోర్టర్ లక్ష్మయ్య
సత్తుపల్లి
ఖమ్మం జిల్లా
ది 19-07-2025 ( శనివారం )
*గుడ్ మార్నింగ్ సత్తుపల్లి కార్యక్రమంలో భాగంగా సత్తుపల్లి మున్సిపాలిటీ 12 వ వార్డ్, ద్వారకాపూరి కాలనీ లో నేడు ప్రజలతో మమేకమవుతున్న సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ మరియు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ గారు.
అన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగులతో కలిసి మార్నింగ్ వాక్ లో సమస్యలు పరిష్కరిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు.
సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డ్, ద్వారకాపూరి కాలనీ లో మార్నింగ్ వాకింగ్ లో భాగంగా ప్రతి ఇంటి ముందుకు వెళ్లి వారి సమస్యలన్నీ అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించడం జరుగుతుంది…
➡️ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్యేనే వారి ఇంటికి వచ్చి సమస్యలు పరిష్కరించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న సత్తుపల్లి మున్సిపాలిటీ ప్రజలు.
కాలనీ లోని రోడ్లు మరియు డ్రైనేజి మరియు విధి లైట్స్ మరియు పరిశుభ్రత గురించి తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించిన ఎమ్మెల్యే గారు…
సత్తుపల్లి మున్సిపాలిటీలో అన్ని వార్డు లు నేరుగా పరిశీస్తాము అని, సత్తుపల్లి మున్సిపాలిటీని తిరిగి అభివృద్ధి పదం లో నడిపిస్తాము అని హామీ ఇచ్చిన MLA గారు
ముఖ్య మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు ఉప ముఖ్య మంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారి సహకారం తో, తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహకారంతో, అదేవిధంగా మంత్రి తుమ్మల నాగేశ్వరావు గారి ప్రోత్బలంతో, సత్తుపల్లి MLA గారి ఆధ్వర్యంలో తప్పకుండా సత్తుపల్లి మున్సిపాలిటీ రూపురేఖలు మారుస్తామని ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు….
ఈ కార్యక్రమం లో మున్సిపల్ అధికారులు, ప్రభుత్వ అధికారులు, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నారావు, సత్తుపల్లి మున్సిపల్ మాజీ కౌన్సిలర్స్, పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా, యూత్, NSUI నాయకులు పాల్గొన్నారు….