
అన్నమయ్య జిల్లా రాజంపేట రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నమయ్య జిల్లా ఎంపీపీల సంఘం అధ్యక్షులు మద్దిరేవుల సుదర్శన్ రెడ్డి, జడ్పిటిసి రమాదేవి, మాజీ ఎంపీపీ రెడ్డయ్య, కోఆప్షన్ సభ్యులు సయ్యద్ అమీర్, మండల ఉపాధ్యక్షులు సమరసింహారెడ్డి, సుబ్బరాయుడు లు పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాలను గాలికి వదిలేసి ప్రభుత్వం ఏర్పాటైనప్పటినుండి రెడ్ బుక్ పాలన కొనసాగిస్తూ వైఎస్ఆర్సిపి నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ సునకానందం పొందుతున్నారన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని పాలన మరచి ప్రతిపక్ష నేతల గొంతు నొక్కే ప్రయత్నం కొనసాగుతోందని ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వారు అన్నారు. ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను మరచి వైయస్సార్సీపి నాయకుల అణచివేతకు కుట్రలు పన్నుతూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం జరుగుతోందని , బీహార్ పాలన తలపిస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ మిథున్ రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తారని వారు అన్నారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird