

అన్నమయ్య జిల్లా రాయచోటి టౌన్ వైస్సార్సీపీ కార్యాలయం లో ఆదివారం పగడాల సాయిరాం మాట్లాడుతూ పెద్దిరెడ్డి కుటుంబాన్ని రాజకీయంగా ఎదుర్కోలేకనే మిథున్ రెడ్డిపై తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించారు.ఈ అరెస్టుతో కూటమి నాయకులకు ఆనందంతప్పా..సాధించేదేమీలేదని వాపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ పెద్దిరెడ్డి కుటుంబంపై కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. ఇందులోభాగంగానే లిక్కర్ స్కాం కేసును క్రియేట్ చేసి అరెస్టుకు రంగం సిద్ధం చేశారని వివరించారు. అయితే ఎన్ని కుట్రలు చేసినా పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఏమీ చేయలేరంటూ స్పష్టం చేశారు. మిథున్ రెడ్డి మచ్చలేని నాయకుడని, కేసులు ధైర్యంగా ఎదుర్కొంటామని సవాల్ విసిరారు.