


Reporter srinivas Kallure: విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న టిఆర్ఎస్ పార్టీ నాయకులు.Reporter srinivas Kallure:
బిఆర్ఎస్ పార్టీ నాయకుల సవాల్.
రాష్ట్రంలో కాంగ్రెస్ ఏర్పడి 20 నెలలు అయినప్పటికీ స్థానిక శాసన సభ్యురాలు డాక్టర్ మట్టారాగమయి కల్లూరు కు చేసిన అభివృద్ధి ఏంటో చూపించాలని బిఆర్ఎస్ పార్టీ నాయకులు స్పష్టం చేశారు.
కల్లూరు లో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ జెడ్పిటిసి సభ్యులు కట్ట అజయ్ కుమార్, డాక్టర్ అక్కినేని రఘు, మాట్లాడుతూ మండల కేంద్రమైన కల్లూరు లో మాజీ శాసనసభ్యులుసండ్ర వెంకట వీరయ్య బిఆర్ఎస్ పార్టీ హయాంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపట్టారని పేర్కొన్నారు. కల్లూరులో స్టేడియం, 30 పడకల ప్రభుత్వాసుపత్రి
బస్ స్టేషన్, నీటి పారుదల శాఖ ఎస్సీ కార్యాలయం.
షాది ఖానా, తోపాటు ఎంతో అభివృద్ధి చేశారని చెప్పారు
ప్రస్తుత శాసన సభ్యురాలు కల్లూరు కు చేసిన పనేంటో
ప్రజలకు తెలియచెప్పాలని సూచించారు. కల్లూరు లో మాజీ మంత్రి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ పార్టీ నాయకులు దగ్ధం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
రేవంత్ రెడ్డి తాను సీఎం అన్న విషయం మరిచిపోయి అడ్డగోలుగా మాట్లాడారు ఆ విషయం దృష్టిలో పెట్టుకొని కేటీఆర్ ఖండించారని బిఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పారు. టిఆర్ఎస్ సోషల్ మీడియా పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఎన్నికల సమయంలో 6, పథకాలు, 420 హామీలు ఇచ్చి ప్రజల మభ్యపెట్టి గెలిచారని బి ఆర్ఎస్ పార్టీ నాయకులు విమర్శించారు. సీతారామ ప్రాజెక్ట్ బి ఆర్ ఎస్ ప్రభుత్వ హ్యంలో నిర్మాణం అయితే కాంగ్రెస్ నాయకులే ఆ ప్రాజెక్టును కట్టినట్టు చెప్పుకోవటం సిగ్గుచేటు అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల నిజ స్వరూపం ప్రజలకు అర్థమైందని రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు పై విమర్శించినట్లయితే తమ నుండి ప్రతిస్పందన ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు కాటమనేని వెంకటేశ్వరరావు, దేవరపల్లి భాస్కరరావు, నర్వనేని అంజయ్య, సూర్యనారాయణ , పెద్ద బోయిన మల్లేశ్వరరావు
వల్లభనేని రవి, షరాబు వెంకటేశ్వరరావు, సయ్యద్ రావూఫ్, ఖమ్మంపాటి పుల్లారావు. పలువురు మాజీ సర్పంచులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు