


సిద్ధవటం VRM న్యూస్ లక్ష్మీనారాయణ జూలై 21
సిద్దవటం మండలం, టక్కోలు:
పల్లె ప్రజల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బంగారు కుటుంబ పథకం గురించి అవగాహన కల్పించే ఉద్దేశంతో టక్కోలు గ్రామంలో గ్రామ సభ ఘనంగా నిర్వహించబడింది. గ్రామస్థాయి సర్వే (P4 సర్వే) ఆధారంగా అర్హతలు, అనర్హతలపై ప్రజలకు స్పష్టమైన సమాచారం ఇవ్వడం జరిగింది.
ఈ సభలో ముఖ్య అతిధిగా పార్లమెంట్ కార్యదర్శి నాగముని రెడ్డి గారు, పంచాయతీ కార్యదర్శి నాగలింగేశ్వర్ రెడ్డి గారు, సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు మరియు గ్రామ ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
సభలో మాట్లాడుతూ అధికారులు ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం పేద కుటుంబాలను గుర్తించి వారికి మద్దతు అందించడమేనని తెలిపారు.
అర్హతలు:
ఎల్పీజీ లేకపోవడం, విద్యుత్ లేని నివాసం, ఆదాయం లేకపోవడం, తాగునీరు దూరంగా ఉండటం, బ్యాంక్ ఖాతా లేకపోవడం వంటి సమస్యలతో బాధపడే కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉందని వివరించారు.
అనర్హతలు:
భూమి అధికంగా కలిగి ఉండడం, ప్రభుత్వ ఉద్యోగం, పట్టణ ఆస్తులు కలిగి ఉండటం, ఆదాయపు పన్ను చెల్లించడం, నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండడం, అధిక విద్యుత్ వినియోగం వంటి అంశాలు పథకం నుండి త్రాటిపెట్టే క్రైటీరియాగా పేర్కొన్నారు.
పార్లమెంట్ కార్యదర్శి నాగముని రెడ్డి గారు మాట్లాడుతూ
ఈ సర్వే ద్వారా నిజంగా అవసరమైన కుటుంబాలను గుర్తించి వారికి సకాలంలో మద్దతు అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తోందని సమావేశంలో తెలియజేశారు.