కోయ భాష పండిట్ల పోస్టులను స్పెషల్ డీఎస్సీ లో ప్రకటించాలి.
దేవీ పట్నం, జులై 21 VRM Midea దుర్గా ప్రసాద్
అల్లూరి సీతారామరాజు జిల్లా,రంపచోడవరం నియోజకవర్గం,రంపచోడవరం మండలం, బంధ పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పెద్ద కోరుమిల్లి ఎంపీపీ పాఠశాల నందు నేడు విశ్వ కోయ గోండి భాష దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ మాట్లాడుతూ…మొదటి తరం ఆదివాసీ స్వాతంత్ర్య సమరయోధులు పోరాట ఫలితంగా 1947 స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 10వ భాగము భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్డ్ లో ఆర్టికల్ 244(1) అధికరణ ద్వారా బ్రిటిష్ కాలం నాటి1874 ప్రాంతమంతా యదావిధిగా షెడ్యూల్డ్ ప్రాంతంగా గుర్తించటం జరిగింది.ఈ పోరాట ఫలితంగా 1952 సంవత్సరంలో జాతీయ ముసాయిదాలో ఆదివాసీల అభివృద్ది, సంక్షేమం మరియు ఆదివాసీల హక్కులు ముఖ్యంగా భూమి,అడవి మొదలైన వాటి పరిరక్షణ కోసం నెహ్రూ 5 పంచశీల సూత్రాలు జాతీయ ముసాయిదాలో పొందుపర్చారు.కానీ ఆదివాసుల అమాయకత్వం వలన నేటికీ అమలు కాలేదన్నారు.ఆదివాసీల అభివృద్ది సంక్షేమం రక్షణ కోసం ప్రత్యేక పరిస్థితులలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 244(1) ప్రకారం (టి.ఏ.సి) ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేసి అభివృద్ది సంక్షేమం కోసం తీర్మానం చేసి గవర్నర్ కి రాష్ట్రపతి ఆమోదం కొరకు పంపించవచ్చున్నారు.కావున ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ కి స్వయం పతిపతి అధికారం కల్పించాలి.టి.ఏ.సి ద్వారా తక్షణమే షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియామకాల చట్టం పై తీర్మానం చేయాలని,ఆదివాసీల మాతృ భాష పరిరక్షణ కోసం ప్రాథమిక దశలో విద్యా బోధన కోసం ఆదివాసీ స్పెషల్ డీఎస్సీ ద్వారా కోయ భాష,సవర భాష పండిట్ పోస్టులను నిటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.ప్రస్తుతం షెడ్యూల్డ్ ప్రాంతంలో ఏకో ఉపాద్యాయ పాఠశాలలే ఎక్కువ దర్శనమిస్తున్నాయి.కావున 2025 జనరల్ డీఎస్సీ లో కేటాయించిన షెడ్యూల్డ్ ప్రాంత టీచర్ పోస్టులు మినహాయించి తక్షణమే ఆదివాసీ పట్టా భద్రుల అభ్యర్థులతో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మడకం వరప్రసాద్ దొర,భారత్ ఆదివాసీ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు చవలం శుభ కృష్ణ దొర,మాజీ సర్పంచ్ కారం వెంకటేశ్వర్లు దొర,శారపు బాపన్న దొర,శారపు స్వామి దొర,ప్రధానోపాధ్యాయులు పొడియం పండు దొర,ఉపాద్యాయుడు కుర్ల ప్రభాకర్ రెడ్డి మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird