

సిద్ధవటం VRM న్యూస్ ప్రతినిధి జూలై 22
సిద్ధవటం మండలం పెద్దపల్లి గ్రామపంచాయతీ గ్రామ సచివాలయంలో గ్రామ సర్పంచ్ తుర్ర చిన్నక్క అధ్యక్షతన బంగారు కుటుంబ పథకంపై గ్రామసభ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సర్పంచ్ చిన్నక్క మంగళవారం గ్రామ సచివాలయంలో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బంగారు కుటుంబం పై అవగాహన కల్పించేందుకు గ్రామసభ ఏర్పాటు చేశామని గ్రామస్థాయి సర్వే,P, 4 సర్వే ఆధారంగా అర్హతలు, అనర్హతలు పై ప్రజలకు స్పష్టమైన సమాచారం ఇవ్వబడుతుందని తెలిపారు బంగారు కుటుంబ పథకంపై అర్హులు ఉన్నవారు సచివాలయంలో సంప్రదించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి, కాడే శ్రీనివాసులు నాయుడు, సర్పంచ్ ప్రతినిధి, తుర్ర ప్రతాప్ నాయుడు, పంచాయతీ కార్యదర్శి శివ సంధ్యారాణి వీఆర్ఓ శివశంకర్, , ఉప సర్పంచ్ ప్రతినిధి నాగం నరసింహారెడ్డి, పెద్దపల్లి గ్రామ సచివాలయ సిబ్బంది, జిలాని భాష,మృణలిని, మనీషా, మాధవి, ప్రియదర్శిని, గ్రామ ప్రజలు పాల్గొన్నారు
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird