నరేంద్ర మోడీ ఆద్వర్యంలో నడుస్తున్న కేంద్ర బిజేపి ప్రభుత్వం ఈ 11 సంవత్స రాల కాలంలో లక్షల కోట్లు అవినీతి చేసిందని తిరుపతి మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతా మోహన్ విమర్శించారు మంగళ వారం స్థానిక కడప ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లా డారు.ఒక పక్క బిజెపి ప్రభుత్వం అవినీతి చేస్తూనే మరో పక్క తమ కాంగ్రెస్ పార్టీ పై విమ ర్శలు చేయడం దెయ్యాలు వేదాలు వెల్లడించినట్టు ఉందన్నారు. చంద్రబాబు, మోడీ వల్ల రాష్ట్రానికి, దేశానికి ఒరిగేదేమీ లేదని తేల్చి చెప్పారు. ఇద్దరూ దొందూ దొందేనని విమర్శించారు