Home ఆంధ్రప్రదేశ్ సీజన్ వ్యాధుల పట్ల ప్రజలు జాగ్రత్త వహించాలిఒంటిమిట్ట డాక్టర్. భావన రెడ్డి

సీజన్ వ్యాధుల పట్ల ప్రజలు జాగ్రత్త వహించాలిఒంటిమిట్ట డాక్టర్. భావన రెడ్డి

by VRM Media
0 comments

VRM న్యూస్ బాల మౌలాలి జూలై 24

ఒంటిమిట్ట మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ భావన రెడ్డి విలేకరుల సమావేశంలో ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ మండలంలోని ప్రజలు సీజన్ వ్యాధుల పట్ల జాగ్రత్త వహించాలన్నారు తమ ఇండ్ల వద్ద మురికి నీరు నిల్వ ఉండకుండా పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. తమ ఇండ్లలో ఉన్న నీళ్ల తొట్లలో నీటిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచకుండా జాగ్రత్త వహించాలని అన్నారు. జ్వరాలు ఉన్నచోట్ల మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి మందులు పంపిణీ చేశా మనీ అలాగే మండలంలో గ్రామాల్లో సీజన్ వ్యాధులు ఉన్నట్లయితే ఒంటిమిట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తెలియజేయాలని వెంటనే మెడికల్ క్యాంపులు ఏర్పాటు మందులు పంపిణీ చేస్తామని అన్నారు. గ్రామాల్లో మురికి కాలువల్లో నీరు నిల్వ ఉన్నట్లయితే దోమలు చేరి ఆ దోమల కాటుల వలన డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ జ్వరాలు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఎవరికైనా జ్వరం వచ్చినట్లయితే ఒంటిమిట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రక్త పరీక్షలు చేయించుకోవాలని ఆమె తెలియజేశారు.

2,838 Views

You may also like

Leave a Comment