


చిత్తశుద్ధి ఉంటే తొమ్మిదో షెడ్యూల్లో పెట్టించండి
జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లింగనబోయిన పుల్లారావు
–స్థానిక సత్తుపల్లి పట్టణంలోని జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో మరియు కల్లూరు పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లింగనబోయిన పుల్లారావు మాట్లాడుతూ42 శాతం బీసీ రిజర్వేషన్ విషయంలో బీజేపీ ది దొంగ వైఖరి అని ,వారికి నిజంగా బీసీల పట్ల ప్రేమ ఉంటే బీసీ బిల్లును 9 వ షెడ్యూల్లో చేర్చే విధంగా కృషి చేయాలని అన్నారు. ఒకవైపు బీసీ ముఖ్యమంత్రి చేస్తామని చెబుతూనే మరోవైపు బీసీలకు వ్యతిరేకంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని ఇలా అయితే రాబోయే ఎన్నికల్లో బిజెపికి బీసీ సమాజం గట్టిగా బుద్ధి చెబుతుందని హెచ్చరించారు తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చటానికి ఇతర రాష్ట్రాల అభిప్రాయాలు అవసరం లేదని తమిళనాడులో రిజర్వేషన్ సమయంలో కూడా అలా జరగలేదని గుర్తు చేశారు ముస్లింలను బూచిగా చూపించి మత రాజకీయాలకు తెర లేపే ప్రయత్నం బీజేపీ చేస్తుందని, దీన్ని బిజెపిలో ఉన్నటువంటి బీసీ సోదరులు కూడా గమనించాలని, లేనిపక్షంలో బీసీ జాతికి మీరు ద్రోహం చేసిన వాళ్ళు అవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గ అధ్యక్షులు దుస్సా వెంకటేశ్వర్లు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల్లి శ్రీను జిల్లా కార్యదర్శి బూడిద రామకృష్ణ సత్తుపల్లి మండల అధ్యక్షులు పామర్తి నాగేశ్వరరావు గౌడ్ బీసీ సంఘం యువజన విభాగం నియోజకవర్గం అధ్యక్షులు ఆలకుంట నరసింహారావు సాదు సత్యనారాయణ శీలం వెంకటనారాయణ రామారావు,కల్లూరు మండల అధ్యక్షులు బొడ్డు కృష్ణ ప్రధాన కార్యదర్శి వెంకటాచారి కల్లూరు పట్టణ అధ్యక్షులు బయ్యారపు నరేంద్ర ఎనుముల రాము, మండేల సుబ్బారావు తిప్పారెడ్డి రామ నరసింహారావు,సీతారాములు జగదీష్ తదితరులు పాల్గొన్నారు.