సిద్దవటం:VRM న్యూస్ పి లక్ష్మీనారాయణ జూలై 23
నియోజకవర్గ పరిశీలకుడు చిట్టీబాబు గారు జరిగిన ఈ సమావేశంలో సిద్దవటం మండలంలో డోర్ టూ డోర్ కార్యక్రమాన్ని వేగంగా పూర్తి చేయాలని నేతలకు సూచించారు.
ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు పార్టీ ప్రచార పాంఫ్లెట్లు పంపిణీ చేయాలని, అందులో ఉన్న ఏడు కాలమ్స్ (హోసింగ్, ఫ్రీ బస్సు, పెన్షన్, తల్లికి వందనం, రైతు భరోసా, గ్యాస్ )లో ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా వాటిని క్లిక్ చేస్తే నేరుగా పార్టీ అధిష్టానానికి సమాచారం వెళ్తుందని తెలిపారు.
ఈ సమాచారం ఆధారంగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు స్వయంగా చర్యలు తీసుకుంటారని ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలను నేరుగా పార్టీ దృష్టికి తీసుకెళ్లే విధంగా ఈ కార్యక్రమం గొప్ప సాధనంగా నిలుస్తుందని ఆయన అన్నారు.
బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి
రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ జగమోహన్ రాజు ఆదేశాల మేరకు రాజంపేట నీయోజకవర్గ పరిశీలకుడు చిట్టీ బాబు గారిని సిద్దవటం నాయకులు కలిశారు. ఈ సందర్భంగా సిద్దవటం మండల ప్రెసిడెంట్ పదవి గత నాలుగు సార్లు రెడ్లకు ఇవ్వబడిందని గుర్తుచేస్తూ, ఈసారి ఆ బాధ్యత బీసీలకు ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు.ఈ అంశాన్ని చిట్టీ బాబు అధిష్ఠానానికి నివేదిస్తానని, అధిష్ఠానం తీసుకునే నిర్ణయమే తుది నిర్ణయమవుతుందని వెల్లడించారు.
ఈ సమావేశంలో పార్లమెంట్ కార్యదర్శి నాగముని రెడ్డి, నాయకులు రాజేష్ నాయుడు, రాజశేఖర్ యాదవ్, మల్లు వెంకట సుబ్బా రెడ్డి, శంకర్, జయరామిరెడ్డి, శ్రీను, సుబ్బా రెడ్డి, జ్యోతి గంగనంద రెడ్డి తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird