Home ఆంధ్రప్రదేశ్ “హరి హర వీరమల్లు” సినిమా ఘనవిజయానికి అందరూ కలిసికట్టుగా భాగస్వాములవ్వాలి

“హరి హర వీరమల్లు” సినిమా ఘనవిజయానికి అందరూ కలిసికట్టుగా భాగస్వాములవ్వాలి

by VRM Media
0 comments

రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాస రాజు
అన్నమయ్య జిల్లా రాజంపేట దావన్
అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం రాజంపేట పట్టణం మన్నూరు శ్రీ ఎల్లమ్మ దేవాలయంలో నేడు యల్లటూరు శ్రీనివాస రాజు సూచన మేరకు రాజంపేట జనసేన పార్టీ నాయకులు యల్లటూరు శివరామరాజు ఆద్వర్యంలో జనసేన పార్టీ శ్రేణులు చిత్రం విజయవంతం కావాలని
“పూజా కార్యక్రమాలు” చేపట్టారు.ఈ సందర్భంగా యల్లటూరు శివరామరాజు మాట్లాడుతూ
తెలుగు సినిమా సాహసోపేతంగా, సమాజానికి సందేశాత్మకంగా ముందుకు సాగుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందిన “హరి హర వీరమల్లు” సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సందర్భంగా పార్టీ తరఫున సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నానని జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాల్లో ప్రజల కోసం పోరాడుతూనే, మరోవైపు చలనచిత్ర రంగంలోనూ ఓ సందేశాత్మక నటుడిగా నిలుస్తున్నారు, ఈ సినిమా ద్వారా ఆయన వ్యక్తిత్వం, ప్రజల పట్ల ఉన్న బాధ్యత స్పష్టంగా కనిపిస్తుంది అని సెలవిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు పాల్గొన్నారు.

2,811 Views

You may also like

Leave a Comment