Home ఆంధ్రప్రదేశ్ తాళ్లపాక అభివృద్ధి పనులకు టీటీడీ బోర్డు ఆమోదం పోతు గుంట కృషి ఫలితం

తాళ్లపాక అభివృద్ధి పనులకు టీటీడీ బోర్డు ఆమోదం పోతు గుంట కృషి ఫలితం

by VRM Media
0 comments

VRM న్యూస్ అన్నమయ్య జిల్లా ఇంచార్జ్ రవిబాబు జూలై 24

పోతు గుంట రమేష్ నాయుడు విజ్ఞప్తి మేరకు టీటీడీ బోర్డు తాళ్లపాక అభివృద్ధి పనులకు ఆమోదం
పోతు గుంట రమేష్ నాయుడు
తాళ్లపాక అన్నమయ్య ధ్యాన మందిరం దగ్గర బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇన్చార్జి పోతుగుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ
పద కవితా పితామహుడు తొలి తెలుగు వాగ్గేయ కారుడు అన్నమయ్య జన్మస్థలి తాళ్లపాక గ్రామాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు గ్రామంలో చేపట్టవలసిన అభివృద్ధి పనులపై టీటీడీ ఈవో దృష్టికి టిటిడి పాలకమండలి సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి ద్వారా తీసుకెళ్లి నిన్న జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో చర్చ జరిగే విధంగా చేసి నిధులు మంజూరుకు ఎనలేని కృషి చేసిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల పార్లమెంట్ ఇన్చార్జి రాజంపేటకు చెందిన పోతు గుంట రమేష్ నాయుడుని ఈరోజు తాళ్లపాక గ్రామస్తులు గ్రామంలోని అన్నమాచార్య ధ్యాన మందిరంలో అన్నమయ్య విగ్రహం వద్ద పూలమాలలు శాలువాలతో సత్కరించి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా తాళ్లపాక గ్రామస్తులు మాట్లాడుతూ తాళ్లపాక గ్రామ అభివృద్ధి చేయాలని పోతు గుంట రమేష్ నాయుడు పలుమార్లు టీటీడీ అధికారులకు గ్రామ మాజీ సర్పంచ్ ఉద్దండం బ్రహ్మయ్య తనయుడు ఉద్దండం సుబ్రహ్మణ్యం తో కలిసి వెళ్లి టీటీడీ ఈవో శ్యామల రావుకు 16 అంశాలతో కూడిన వినతి పత్రాన్ని అందజేసి తాళ్లపాక రహదారిని విస్తరించి రోడ్డుకి ఇరువైపులా కవులు కళాకారులు విగ్రహాలు ప్రతిష్టించి లైటింగ్ మరియు దేవుని పాటలతో కూడిన మైక్ సెట్టింగ్ అరేంజ్మెంట్. తాళ్లపాక చెరువులో అన్నమయ్య కూర్చునిపద కవితలు రాస్తున్నట్లుగా విగ్రహం ఏర్పాటు చేయాలని, సంగీత, నృత్య కళాశాలల తో పాటు మ్యూజియం , సుదర్శన్ , లడ్డు కౌంటర్లను ఏర్పాటు చేయాలని అలాగే అన్నమయ్య గతంలో ఎలా జీవించి ఉన్నారో అలాంటి చిత్రాన్ని ఒక చిన్న ఇంటిని నిర్మించడం ధ్యాన మందిరాన్ని పునర్నిర్మించడం 108 అడుగుల విగ్రహం దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి గుడిని నవంబర్ లో ప్రారంభిస్తారని చెప్పడం విన్నవించడంతో స్పందించిన ఈవో శ్యామల రావు టిటిడి బోర్డు మీటింగ్ లో 16 అంశాలను అజెండాగా పెట్టి తాళ్లపాక అభివృద్ధికి నిధులు మంజూరు చేసేందుకు నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ విషయమని చెప్పారు. ఇందుకు టిటిడి ఈవో శ్యామల రావుకు, చైర్మన్ బిఆర్ నాయుడుకు, జేఈవో వీరబ్రహ్మం లకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చెప్పారు. త్వరలో గ్రామస్థులం కలిసి తిరుపతికి వెళ్లి వారిని కూడా సత్కరించి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు వై సురేష్ రాజు, పట్టు పోగుల ఆదినారాయణ, తోట నగేష్, పి పాపయ్య తాళ్లపాక గ్రామస్తులు ఉద్దండం సుబ్రహ్మణ్యం, జవ్వాజి అదృష్టదీపుడు, జవ్వాజి మోహన్ రావు, జవ్వాజి వంశీ, కొత్తపల్లి నరేంద్ర, రామ గోవిందు, వెంకటరాజు లతోపాటు తాళ్లపాక గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

2,814 Views

You may also like

Leave a Comment