దేవీ పట్నం, జులై 23 VRM Midea దుర్గా ప్రసాద్
ఈనెల జులై 25వ తేదీన తొలి మన్యం వీరుడు,స్వాతంత్ర్య సమరయోధుడు కారం తమ్మన్న దొర 145వ వర్ధంతి సందర్భంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా తెల్లం శేఖర్ మాట్లాడుతూ…భారత దేశంలో 1857 తిరుగు బాటుకు ముందే కారం తమ్మన్న దొర బ్రిటిష్ వారిపై ఆంధ్ర ప్రాంతంలోని రంపచోడవరం కేంద్రంగా రంప తిరుగు బాటు 1839 నుండి 1847 వరకు జరిగింది.ఈ రంప తిరుగుబాటుకు నాయకత్వం వహించిన కారం తమ్మన్న దొర పాత తూర్పు గోదావరి జిల్లా,రంపచోడవరం మండలం,బంధ పల్లి గ్రామం కోయ ముఠాదార్ అన్నారు.ఐదుగురు ముఠాదారుల మద్దతుతో 30 మందితో కూడిన బలియమైన సాయుధ బృందాన్ని ఏర్పాటు చేసుకొని బ్రిటిష్ వారిపై దఫా దఫాలుగా యుద్ధం చేశారు.బ్రిటిష్ వారిని భారత దేశం నుండి ఎలాగైనా తరిమికొట్టాలని జరిగిన పోరాటంలో 25 జులై 1880 లో వీరమరణం పొందారు.కావునా ఇంతటి ఘన చరిత్ర కల్గిన కారం తమ్మన్న దొర 145వ వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలి.మరియు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird