


రాజంపేటVRM న్యూస్ ప్రతినిధి జూలై 25
రాజంపేట మండలం పులపుత్తూరు గ్రామంలోని అంగన్వాడి కేంద్రాన్ని ఈరోజు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల పార్లమెంట్ ఇన్చార్జి పోతుగుంట రమేష్ నాయుడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా అంగన్వాడీ కేంద్రంలో ఉన్న రిజిస్టర్ ను పరిశీలించి పిల్లల పేర్లను పిలుస్తూ హాజరైన వారి సంఖ్యను తెలుసుకున్నారు. అనంతరం అంగన్వాడీ కార్యకర్త ఇంద్రావనితో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి అమలవుతున్న పథకాలన్నీ సక్రమంగా అందుతున్నాయా? మెనూ ఏ విధంగా అమలు చేస్తున్నారు? వారంలో ఎన్ని రోజులు పిల్లలకు కోడి గుడ్డును అందిస్తున్నారని, గర్భవతులకు బాలింతలకు పౌష్టిక ఆహారాన్ని సరఫరా చేస్తున్నారా లేదా అని ఆయా నాగమణిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పట్టు పోగుల ఆదినారాయణ, మండల అధ్యక్షులు ప్రసాద్ రెడ్డి, రమణ, శివ తదితరులు పాల్గొన్నారు.