అధికారులు నిర్లక్ష్యమా లేక ముడుపుల అంటూ ఆరోపణలు
డుంబ్రిగుడ (అల్లూరి జిల్లా) న్యూస్:-VRM Midea
అల్లూరి జిల్లా డుంబ్రిగుడ మండలం కించుమండ గ్రామం ప్రధాన రహదారి నడిబొడ్డున ఒక గిరిజనేతరుడు అది కూడా ఇతర రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి 1/70 చట్టంకు వ్యతిరేకంగా గత కొన్ని నెలలు క్రితం అక్రమ నిర్మాణం చేపట్టారు. అయితే స్థానిక సూపర్ ఎంపీటీసీ చిరంజీవి మరియు స్థానిక గిరిజనులు మమేకమై ఒక గిరిజనేతరుడు గిరిజనులు హక్కులు,చట్టాలు తుంగ్గలోకి తొక్కుతూ అక్రమ నిర్మాణాలు కడుతున్నారని తక్షణమే దీనిని నిలిపివేసి గిరిజనులు హక్కులు,చట్టాలు కాపాడాలని పోరాటం చేశారు. స్పందించిన సంబంధిత అధికారులు తక్షణమే రంగంలోకి దిగి ఇక్కడ నిర్మాణం చేపట్టకూడదు ఇది చట్ట విరుద్ధంగా నిర్మాణం చేస్తున్నారని,అంతే కాకుండా గిరిజనుల హక్కులు, చట్టాలు ఉల్లంఘణ అని తక్షణమే నిర్మాణాలు ఆపేశారు. అయితే నేడు అదే ప్రదేశంలో తెర చాటున అక్రమ నిర్మాణం యధావిధిగా భవన నిర్మాణం చేపడుతున్నారు. మరి ఆనాడు అక్రమ నిర్మాణం అని నిలిపివేసిన స్థలంలో నేడు యధావిధిగా మళ్లీ నిర్మాణం చేపడుతున్నారంటే ఇది ఎవరి లోపం అధికారుల లోపం కాదని స్థానిక గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు జిల్లా కలెక్టర్ వర్యులు గిరిజనులు హక్కులు,చట్టాలు కాపాడాలి ఎవరైనా ఉల్లంఘిస్తే తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేస్తే నిలిపివేసిన అక్రమ నిర్మాణం నేడు కడుతున్నారంటే సంబంధిత అధికారులు నిర్లక్ష్యమా లేక ముడుపుల అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి? తలెత్తడం కాదు వాస్తవమేనని పలువురు అంటున్నారు ఎందుకంటే ఆనాడు అక్రమ నిర్మాణం చేపడుతున్నారని అధికారులు నిలిపివేసిన ప్రదేశంలోనే మళ్ళీ యధావిధిగా కడుతున్నారంటే సంబంధిత అధికారుల అండదండలు ఉండే ఉంటాయనే గుసగుసలు వెల్లువెత్తుతున్నాయి. మరి గిరిజనుల హక్కులు, చట్టాలు తుంగలోకి తొక్కి అక్రమ నిర్మాణం చేపడుతున్నారు అనేది నేరుగా కనిపిస్తుంది, అలాగే సంబంధిత అధికారులు ఎలాగో పట్టించుకోలేదు కనుక జిల్లా అధికారులు అయినటువంటి కలెక్టర్,పిఓ స్పందించి తక్షణమే అక్రమ కట్టడాలు నిలిపివేసి అధికారుల ఆదేశాలు పట్టించుకోకుండా చట్ట విరుద్ధంగా మళ్ళీ నిర్మాణం చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని గిరిజనులు పలు గిరిజన సంఘాలు కోరారు. లేకుంటే గిరిజనుల హక్కులు,చట్టాలు కాపాడుకునేందుకు పలు గిరిజన సంఘాలు పోరాటాలు, ఉద్యమాలు చేపట్టి సంబంధిత కార్యాలయాలు ముట్టడి చేయడం ఖాయమని హెచ్చరించారు. ఏది ఏమైనప్పటికి అక్రమ నిర్మాణం అని అధికారుల ఆపిన మళ్లీ భవనం అక్రమంగా కడుతున్నారంటే దీని వెనక ఎవరెవరు అండదండలు ఉన్నాయో జిల్లా అధికార యంత్రాంగం కూడా గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటేనే ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు హక్కులు, చట్టాలకు రక్షణ ఉంటుంది లేకుంటే మనుగడ కూడా కష్టమే మరి జిల్లా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది ప్రశ్నార్ధకం…?
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird