అన్నమయ్య జిల్లా నందలూరు స్టాఫ్ రిపోర్టర్ దావన్
ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి పల్లేటి రామసుబ్బారెడ్డి, అన్నమయ్య జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు,
రాజంపేట జర్నలిస్టుల సంక్షేమమే ఏపీయూడబ్ల్యూజే ధ్యేయమని రాష్ట్ర కార్యదర్శి పల్లెటి రామసుబ్బారెడ్డి అన్నారు. పట్టణ కేంద్రంలో బైపాస్ రోడ్డులో ఉన్నటువంటి అరవింద్ నేత్రాలయంలో డాక్టర్ అరవింద్ సహకారంతో వర్కింగ్ జర్నలిస్టులకు ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి పల్లెటి రామసుబ్బారెడ్డి, అడిషనల్ ఎస్పీ మనోజ్ రామ్నాథ్ హెగ్డే, అన్నమయ్య జిల్లా అధ్యక్షులు గౌనుపల్లి శ్రీనివాసులు, గౌరవ అధ్యక్షులు కృష్ణయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేస్తున్న జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని డాక్టర్ అరవింద్ ఉచిత కంటి పరీక్షలు, డయాబెటిస్ పరీక్షలు నిర్వహించడం అభినందనీయమన్నారు. రానున్న రోజుల్లో కూడా జర్నలిస్టుల సంక్షేమం కోసం మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. అనంతరం ముఖ్య అతిథులుగా విచ్చేసిన అతిధులను శాలవాతో ఘనంగా సత్కరించారు. అనంతరం పలువురు జర్నలిస్టులకు కంటి అద్దాలను పంపిణీ చేశారు. ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాజంపేట కేంద్రంగా పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొని అరవింద్ హాస్పిటల్ లో కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు బచ్చోటి భాస్కర్, తాలూకా అధ్యక్షులు ఇండ్లూరి చిన్న వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి శివ,సీనియర్ పాత్రికేయులు మలిశెట్టి సుబ్బ నరసింహులు,రాజంపేట ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి మందా శివయ్య, ఉపాధ్యక్షులు శివయ్య నాయుడు,దావన్ కోశాధికారి సునీల్, కార్యనిర్వక కార్యదర్శి మండ్ల శ్రీహరి, కమిటీ సభ్యులు నరసింహ, నాగేంద్ర ప్రసాద్, రవి, కళ్యాణ్, మధుసూదన్, చామంచి వెంకటసుబ్బయ్య.నందలూరు నుంచి పలువురు పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird