

దేవీ పట్నం ప్రెస్ నోట్:VRM Midea
రంపచోడవరం కేంద్రంగా కారం తమ్మన్న దొర పేరుతో జిల్లా ఏర్పాటు చేయాలని ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ డిమాండ్ చేశారు. ఈ రోజు అల్లూరి సీతారామరాజు జిల్లా,రంపచోడవరం నియోజకవర్గం,దేవీ పట్నం మండలం,దేవారం గ్రామ పంచాయతీ పరిధిలోని పోతవరం గ్రామంలోని ఏపీ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో బాలురు హాస్టల్ నందు తొలి మన్యం వీరుడు,స్వాతంత్ర్య సమరయోధుడు కారం తమ్మన్న దొర 145 వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో తెల్లం శేఖర్ మాట్లాడుతూ…తొలి మన్యం వీరుడు రంపచోడవరం మండలం,బంధ పల్లి గ్రామం కోయ ముఠాదార్ ఆయన కారం తమ్మన్న దొర 1839 నుండి 1880 వరకు రంపచోడవరం కేంద్రంగా చేసుకుని ఐదుగురు ముఠాదారుల మద్దతుతో 30 మంది ఆదివాసులతో కూడిన బలమైన సాయుధ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని బ్రిటిష్ వారిపై దఫా దఫాలుగా యుద్ధం చేసి రంప తిరుగుబాటు రంప పీతూరు కి నాందిపలికారు.ఆదివాసులు భూముల జోలికి,అడవుల జోలికి,సహజ సంపదల జోలికి వస్తె సహించేది లేదని బ్రిటిష్ వారుతో 1880 జులై 25 తేదీన యుద్ధంలో కారం తమ్మన్న దొర వీరమరణం పొందారు.కావున కారం తమ్మన్న దొర పేరుతో రంపచోడవరం కేంద్రంగా జిల్లా ప్రకటించాలన్నారు.అలాగే కారం తమ్మన్న దొర జీవిత చరిత్ర పాఠ్యాంశాలలో చేర్చాలన్నారు.మరియు తొలి మన్యం వీరుడు స్వాతంత్ర్య సమరయోధుడు కారం తమ్మన్న దొర విగ్రహం రంపచోడవరం కేంద్రంలో ఏర్పాటు చేయాలన్నారు.రంపచోడవరం కేంద్రంగా ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేయాలని మరియు కారం తమ్మన్న దొర వర్ధంతి వేడుకలు అధికారికంగా నిర్వహించాలని ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో తొలి మన్యం వీరుడు స్వాతంత్ర్య సమరయోధుడు కారం తమ్మన్న దొర గురించి విద్యార్థులను ఉద్దేశించి ఉపాద్యాయులు ప్రసంగించారు.ఈ కార్యక్రమానికి ముందుగా కారం తమ్మన్న దొర చిత్ర పటానికి పూలు మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించామన్నారు.
ఈ కార్యక్రమంలో కారం సురేష్ దొర,ఇన్చార్జి హెచ్ఎం జి.రాజు,ఉపాద్యాయులు మడకం రామకృష్ణ దొర,ఎం.గోపాల్ కృష్ణ,బులియమ్మ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.