Home వార్తలుఖమ్మం కల్లూరు మరో ఫైనాన్స్ వ్యాపారి ఆగడాలు

కల్లూరు మరో ఫైనాన్స్ వ్యాపారి ఆగడాలు

by VRM Media
0 comments

Vrm media ప్రతినిధి శ్రీనివాస్ రాథోడ్ కల్లూరు

అక్రమంగా మామిడి చెట్లు నరికివేత

న్యాయం చేయాలని వేడుకుంటున్న బాధితులు

కల్లూరు, జూలై 26

కల్లూరు మండలంలోని చండ్రుపట్ల గ్రామంలో ఓ ఫైనాన్స్ వ్యాపారి శనివారం తన అవసరాన్ని ఆసరాగా చేసుకుని (సెల్ రిజిస్ట్రేషన్ గల భూమిపై) ఓ మామిడి తోటలో అక్రమంగా తన అనుచరులతో ప్రవేశించి(సెల్ రిజిస్ట్రేషన్ గల భూమిపై) ఓ మామిడి తోటలో అక్రమంగా తన అనుచరులతో ప్రవేశించి దౌర్జన్యంగా విలువైన మామిడిచెట్లు నరికించిన సంఘటన వెలుగు చూసింది. ఈ సంఘనటపై సదరు (మామిడి తోట) భూమి యాజమాని మానాల రవికుమార్, యశోద కళ్యాణి దంపతులు విలేకరులకు తెలిపిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కల్లూరు పట్టణానికి చెందిన ఫైనాన్స్ వ్యాపారి తోకచిచ్చు అంజనేయరాజు వద్ద 2014 వ సంత్సరంలో చండ్రుపట్ల గ్రామంలో తమకు గల సర్వే నెం 87/ఉ/అ/ఆ ప్రకారం 13 గంటల మామిడి తోట ఉన్న భూమిని, తమ తమ పిల్లల చదువుల అవసరాల నిమిత్తం రూ. 3.50 లక్షలకు సేల్ రిజిస్ట్రేషన్ చేయించుకుని నగదు ఇచ్చాడని బాధితులు యశోద, రవి కుమార్లు తెలిపారు. ఇలా ఇరువురు మధ్య కుదిరిన ఒప్పదం ప్రకారం పై నగద ను వడ్డీతో సహా చెల్లించేందకు తాము 2014 సంత్సరంలో ముందుకు రాగా ఫైనాన్స్ వ్యాపారి వడ్డీ కింద తీసుకున్న నగదుతో పాటుగా వడ్డీకి ఆ భూమి విలువ సరిసమానమని అంటూ తమవడ్డీ కింద తీసుకున్న నగదుతో పాటుగా వడ్డీకి ఆ భూమి విలువ సరిసమానమని అంటూ తమ భూమిని అక్రమించుకునుందుకు సిద్ధమైనాడని బాధితులు వివరించారు. ఫైనాన్స్ వ్యాపారి తోకచిచ్చు అజనేయనేయరాజు వద్దకు తాము పలు మార్లు ఫైనాన్స్ కింద తీసుకున్న నగదుతో పాటుగా వడ్డీ చెల్లించేలా వెళ్లగా అందుకు నిరాకరిస్తూ ఆ భూమి తమదేనని సదరు ఫైనాన్స్ వ్యాపారి పలు విధాలుగా వేధింపులకు పాల్పడినట్లు బాధితులు రవికుమార్, యశోద కళ్యాణిలు విలేకరులకు వివరించారు. ఇలా శనివారం మధ్యాహ్నం సమయంలో గుట్టుచప్పుడు కాకుండా తమ మామిడి తోటలో అనుచరులతో ఫైనాన్స్ వ్యాపారి ప్రవేశివించి అక్రమంగా చెట్లు నరికించాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తోటలో ఉన్న చెట్లను నరుకుతుండగా తమపై ఫైనాన్స్ వ్యాపారి దౌర్జన్యంకు పాల్పడినట్లు బాధితులు విలేకరులకు తెలిపారు.ఇలా ఫైనాన్స్ కింద తీసుకున్న నగదు రూ.3.50 లక్షలకు గాను వడ్డీతో సహా కలిపి చెల్లించక పోతే ఆ భూమి స్వాధిన పరచుచుకుంటానని ఫైనాన్స్ వ్యాపారి బెదిరింపులకు పాల్పడినట్లు బాధితులు మానాల రవికుమార్, యశోద కళ్యాణిలు తెలిపారు. ఇలా తమపై ఫైనాన్స్ వ్యాపారి పాల్పడుతున్న వేధింపుల నుంచి కాపాడుతూ న్యాయం చేయాలని వారు స్థానిక పోలీసులకు పిర్యాదు చేసినట్లు తెలిపారు.

2,806 Views

You may also like

Leave a Comment