
VMR న్యూస్ బాల మౌలాలి న్యూస్ జూలై 27:

నీటిపారుదల శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ నిమ్మల రామానాయుడు కడపకు వెళుతున్న సందర్భంగా కడప చెన్నై ప్రధాన రహదారిపై గల శ్రీ కోదండరాముని కళ్యాణ వేదికకు ఎదురుగా ఉన్న మయూర గార్డెన్స్ నందు ఒంటిమిట్ట మండలానికి చెందిన టిడిపి నేతలు ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు కలిసి శాలువాలు కప్పి గజమాలతో ఆయనకు స్వాగతం పలికారు. ఒంటిమిట్టలో గల సమస్యలపై ప్రధానంగా సోమశిల వెనుక జలాలు ఒంటిమిట్ట చెరువుకు తరలింపు పై వినతి పత్రాలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు. హరి ప్రసాద్. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు. గజ్జల నరసింహారెడ్డి. క్లాస్ వన్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్. ఎస్వీ రమణ. తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి. బొబ్బిలి రాయుడు. టిడిపి మండల వైస్ ప్రెసిడెంట్. గగుటూరి మౌలాలి. తెలుగుదేశం సీనియర్ నాయకుడు. రోశయ్య. తెలుగుదేశం నాయకుడు. రమణ. ఒంటిమిట్ట చెరువు సంఘం చైర్మన్ పాటూరి గంగిరెడ్డి. వైస్ చైర్మన్ కట్ట యాదయ్య. కత్తి చంద్ర. నర్వకట్టపల్లి మాజీ ఉపసర్పంచ్ నాగరాజు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు రాజారెడ్డి మాజీ ఎంపీటీసీ నరసింహులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.