Home ఆంధ్రప్రదేశ్ టక్కోలు SC కాలనీలో “సూపరిపాలన తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమం ఘనంగా ప్రచారం

టక్కోలు SC కాలనీలో “సూపరిపాలన తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమం ఘనంగా ప్రచారం

by VRM Media
0 comments

సిద్ధవటంVRM న్యూస్ లక్ష్మీనారాయణ జూలై 28

రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, శ్రీ నారా లోకేష్ స్ఫూర్తి తొ, రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ జగన్ మోహన్ రాజు ఆధ్వర్యంలో
కడప జిల్లా, సిద్ధవటం మండలం టక్కోలు గ్రామ పంచాయతీలోని ఎస్‌సి కాలనీలో “సూపరిపాలన తొలి అడుగు” డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించబడింది. ప్రతి ఇంటికీ వెళ్లి, కూటమి ప్రభుత్వం గత ఒక సంవత్సరం కాలంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు తెలియజేస్తూ, చైతన్య వంతంగా ప్రచారం సాగింది.
ప్రజల మద్దతే ప్రభుత్వ విజయానికి ఆధారం నాగముని రెడ్డి
ఈ సందర్భంగా పార్లమెంట్ కార్యదర్శి నాగముని రెడ్డి మాట్లాడుతూ, “సూపరిపాలన అంటే ప్రజలకు చేరువైన పరిపాలన. ప్రజల భాగస్వామ్యంతోనే ప్రభుత్వ పనితీరు బలోపేతం అవుతుంది” అని అన్నారు. అలాగే, “ప్రతి ఇంటికీ చేరి ప్రజల సమస్యలు తెలుసుకోవడం, పాలనపై విశ్వాసం పెంచడం మా లక్ష్యం” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో చిన్నప రెడ్డి, సుబ్బయ్య, సుదీర్, ఆంజనేయులు, సంటయ్యా, ప్రసాద్ సహా టిడిపి కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

2,802 Views

You may also like

Leave a Comment