

దేవీ పట్నం జులై 28.VRM Midea దుర్గా ప్రసాద్
రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ లో నియమించిన ఆదివాసీయేతరులను తొలగించాలని ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా తెల్లం శేఖర్ మాట్లాడుతూ…ఇటీవల ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ లో ఆదివాసీయేతరులను నియమించడం రాజ్యాంగ విరుద్ధం అన్నారు.రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ లో ఆదివాసీయేతరులను నియమించటం వలన 5 వ షెడ్యూల్డ్ భూ భాగంలో ఉన్న ఆదివాసీల అభివృద్ది సంక్షేమం రక్షణ మరియు హక్కులు,చట్టాల పరిరక్షణ కోసం ఎటువంటి కృషి చేయచేయటం లేదన్నారు.రాష్ట్ర ప్రభుత్వానికి ఆదివాసులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు విద్యా,వైద్యం,ఉద్యోగ,ఉపాధి,హక్కులు,చట్టాలు మరియు మౌలిక వసతులు కల్పించడంలో మరియు పరిష్కారం కోసం ఎటువంటి నివేదికలు రాష్ట్ర ప్రభుత్వానికి పంపించటం లేదన్నారు.కావున ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ లో నియమించిన ఆదివాసీయేతరులను తొలగించి ఆదివాసీ ప్రజా ప్రతినిధులను నియమించాలి.లేదా ఆదివాసీ ఉద్యోగ సంఘాలతో ఉన్న ఆదివాసీ మేధావులను మరియు ఆదివాసీ ప్రజా సంఘాలతో పనిచేస్తున్న నాయకులను నియమించాలని ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.