Home ఆంధ్రప్రదేశ్ హుకుంపేటలో ఆనవాయితీగా మారిన పారిశుద్ధ్య సమస్య

హుకుంపేటలో ఆనవాయితీగా మారిన పారిశుద్ధ్య సమస్య

by VRM Media
0 comments

విష జ్వరాలు బారిన పడుతున్న గిరిజనులు – పట్టించుకోని అధికారులు

హుకుంపేట (అల్లూరి జిల్లా) న్యూస్ :VRM Midea దుర్గాప్రసాద్

అల్లూరి జిల్లా హుకుంపేట ప్రధాన కేంద్రంలో పారిశుద్ధ్య సమస్య ఎప్పుడూ ఉంటుందనే సంగతి మన అందరికీ తెలిసిందే, అయితే ఇప్పుడు కురుస్తున్న వర్షాలు కారణంగా ఈ సమస్య తారా స్థాయికి చేరింది. ముఖ్యంగా స్కూలు ప్రక్కన మరియు ప్రధాన రహదారులు పక్కన ఎక్కడపడితే అక్కడ చెత్త చెదారం పేరుకుపోవడంతో వీటి నుండి ఒకవైపు వెదజల్ల దుర్వాసన మరోవైపు క్రిమి కీటకాలు విలయ తాండవం ఆడుతున్నాయి. ముఖ్యంగా ప్రధాన రహదారిలో నిలబడేందుకు కూడా వీలులేని విధంగా పారిశుధ్య లోపం ఉంది.అదేవిధంగా స్కూలు ప్రక్కన మరి ఎక్కువగా చెత్తాచెదారం పేరుకుపోవడం దానిని శుభ్రం చేయకపోవడంతో వాటి నుండి వెదజల్లే దుర్వాసన మరియు చెత్తాచెదారం నుంచి ఉద్భవించిన క్రిమి కీటకాల బారిన పడి విద్యార్థులు విషజ్వరాల బారిన పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఏదైనా పత్రికల్లో మీడియాలో కథనాలు వస్తే సంబంధిత అధికారులు హుటా హుటిన ఒక నాలుగు రిక్షాలు తీసుకువచ్చి చెత్త ఎత్తించి ఒక ఇంత బ్లీచింగ్ పిండి జల్లేసి చేతులు దులుపుకుంటున్నారు తప్ప హుకుంపేటలో పారిశుధ్య లోపం సమస్య పరిష్కారం చేసి ప్రజలకు మంచి చేయడంలో విఫలం అవుతున్నారు అని ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. జిల్లాకు ఆమడ దూరంలో ఉన్న హుకుంపేట ప్రధాన కేంద్రం పరిస్థితి ఇలా ఉంటే మారుమూల ప్రాంతాల పరిస్థితి ఏమిటని ఆలోచించడం కూడా వృధా అనే విమర్శలు వెల్లువెత్తుతున్నయి. ఏజెన్సీ ప్రాంతంలో కేవలం జ్వరాలు బారిన పడే గిరిజనులు మృత్యువాత పడుతున్నారు. ఈ తరుణంలో గిరిజనులు మరణిస్తే దానికి కారణం సంబంధిత అధికారులే కారణమనే విషయం గుర్తుంచుకోవాలని సమాధానం కూడా వాళ్లే చెప్పాలి,దానికి బాధ్యత వహించాల్సింది సంబంధిత అధికారులే అని ప్రజలు ముక్కు సూటిగా చెబుతున్నారు. అయ్యా జిల్లా కలెక్టర్ వర్యులు పిఓ హుకుంపేట ప్రధాన కేంద్రంలో పారిశుద్ధ్య లోపం సమస్య పరిష్కారం చేయడంలో అధికారులు విఫలమవుతున్నారు అనేది నేరుగా కనిపిస్తుంది కనుక దయచేసి మీరైనా ప్రజల ప్రాణాలు దృష్టిలో పెట్టుకొని పూర్తిస్థాయిలో పారిశుధ్య సమస్య పరిష్కారం చేయాలని ప్రజలందరూ చేతులెత్తి నమస్కరిస్తూ వేడుకుంటున్నారు. మరి జిల్లా అధికార యంత్రాంగమైన ఈ సమస్య పరిష్కారం చేస్తారా గిరిజనులు ప్రాణాలు పోతే మనకెందుకులే అని గాలికి వదిలేస్తారా అనేది ప్రశ్నార్థకం..?

2,810 Views

You may also like

Leave a Comment