


సిద్ధవటం VRM న్యూస్ ప్రతినిధి జూలై 28
రాష్ట్ర టీడీపీ ఆదేశాల మేరకు కొనసాగుతున్న సుపరిపాలనలో తొలి అడుగు* కార్యక్రమం రేపు అనగా 29/7/2025వ తేదీ మంగళవారం నాడు సిద్ధవటం మండలం మాధవరం-1 గ్రామ పంచాయతీలో మధ్యాహ్నం 3.30 గంటల నుండి మండల పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి *రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షులు శ్రీ చమర్తి జగన్మోహన్ రాజు గారు విచ్చేయడం జరుగుతుంది. మండలంలోని ముఖ్య నాయకులు, పదాధికారులు, టిడిపి బూత్ కన్వీనర్సు, యూనిట్ ఇన్చార్జులు, గ్రామ కమిటీ సభ్యులు, కార్యకర్తలు, ప్రజలు విరివిగా పాల్గొని పార్టీ నిర్దేశించిన కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకొని పోయే విధంగా సహకరించగలరని కోరుతున్నాము గమనిక మధ్యాహ్నం 3.30 గంటలకు డాక్టర్ వీరభద్రుడు గారి హాస్పిటల్ వద్దకు చేరవలసినదిగా తెలియజేయుచున్నాము.
ఇట్లు మీ. శనివారపు మోహన్ రెడ్డి (మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు)
దారపునేని దశరధ రామానాయుడు (టీడీపీ మండల క్లస్టర్ ఇంచార్జ్)