Home ఆంధ్రప్రదేశ్ సారా పై ఉక్కుపాదం మోపిన పోలీసులు

సారా పై ఉక్కుపాదం మోపిన పోలీసులు

by VRM Media
0 comments

150 లీటర్లు సారా స్వాధీనం, 6000 లీటర్ల పులుపు ధ్వంసం

హుకుంపేట (అల్లూరి జిల్లా) న్యూస్ :VRM Midea దుర్గా ప్రసాద్

అల్లూరి జిల్లా హుకుంపేట మండలం ఓల్డా పంచాయతీ పూసలగురువు, ఉప్ప మరియు పరిసర ప్రాంతాల్లో హుకుంపేట మండల సిఐ సన్యాసినాయుడు ఆధ్వర్యంలో సివిల్ డిపార్ట్మెంట్, మరియు జిల్లా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మమేకమై ఓల్డా మరియు మత్స్య పురం పంచాయతీ పరిధిలో గల పూసలగరువు, ఉప్ప గ్రామాల్లో నేడు స్థానిక సీఐ సన్యాసినాయుడు ఆధ్వర్యంలో పాడేరు ఎక్సైజ్ శాఖ వారితో ముకుముడిగా సారా బట్టీలపై పై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా హుకుంపేట సీఐ సన్యాసి నాయుడు మీడియాతో మాట్లాడుతూ ముందస్తు సమాచారం మేరకు నేడు ఒల్దా పంచాయతీ పరిధిలో గల పరిసర ప్రసారా బట్టీలపై దాడి చేపట్టడం జరిగిందని ఈ దాడుల్లో సారా తయారీకి సిద్ధం చేసిన 6000 లీటర్ల పులుపు గుర్తించి ధ్వసం చేయడం జరిగిందని అలాగే సారా తయారీకి వాడే నల్ల బెల్లం దిమ్మలను 150 లీటర్లు నిల్వ సారాను స్వాధీన పరుచుకోవడం జరిగిందని తెలిపారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ పరిసర ప్రాంతాల్లో కొన్ని గ్రామాల్లో గ్రామస్తులు కొంతమంది మమేకమై మూకుముడిగా వ్యాపారం కొనసాగిస్తున్నారని, గతంలో పోలీసులు పట్టుకునేందుకు ఆ గ్రామాలకు వెళ్ళినప్పుడు సారా వ్యాపారులు పోలీసులను చూడగానే ఇల్లు విడిచి పారిపోతున్నారని, వారి ఇళ్లల్లో సారా పట్టుకున్న వారి వివరాలు చెప్పండి అని గ్రామస్తులు అడిగితే మాకు తెలియదు అంటూ సమాధానం ఇవ్వడంతో నేడు స్థానిక వీఆర్ఏ వీఆర్వో సంబంధిత అధికారులను ద్వారా పరారైన వారి వివరాలు సేకరించామని పరారైన వారిని వేగవంతంగా అదుపులోకి తీసుకొని చట్టపరమైన కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ సీఐ టీ వి వి ఎస్ ఎన్ ఆచార్య, స్థానిక ఎస్సై సూర్యనారాయణ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

2,811 Views

You may also like

Leave a Comment